Rohit Sharma Chants At Wankhede During Lionel Messi GOAT Tour
Rohit Sharma : ద గోట్ ఇండియా టూర్‌లో భాగంగా అర్జెంటీనా దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ ఆదివారం ముంబైలో పర్యటించాడు. వాంఖడే స్టేడియంలో మెస్సీకి ఘన స్వాగతం లభించింది. మొదటగా ఆల్‌స్టార్స్ ఆటగాళ్లతో కరచాలనం చేసిన మెస్సీ ఆ తరువాత టీమ్ఇండియా ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు ఛెత్రిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఛెత్రికి నంబర్ 10 జెర్సీని బహుమతిగా ఇచ్చాడు.
Babar Azam : దటీజ్ బాబర్ ఆజామ్.. బిగ్‌బాష్ లీగ్ అరంగ్రేట మ్యాచ్‌లోనే..
అనంతరం క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా తన ఆటోగ్రాఫ్‌తో కూడిన 2011 వన్డే ప్రపంచకప్ జెర్సీ (నంబర్ 10)ని మెస్సికి అందజేశాడు సచిన్. ఇక ఫుట్‌బాల్‌లో మెస్సీ జెర్సీ నంబర్ కూడా 10 అన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ బంతిని సచిన్‌కు మెస్సి అందజేశాడు.
NO.10 x NO.10. 🐐 pic.twitter.com/HxQxDaC7ht
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 14, 2025
అయితే.. మెస్సీ, సచిన్‌లు మైదానంలో ఉండగానే, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మైదానంలో లేకపోయినప్పటికి కూడా అభిమానులు అతడి నామస్మరణ చేశారు. ముంబై కా రాజా రోహిత్ శర్మ అంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
During Messi’s GOAT Tour event, chants of “Mumbai cha Raja Rohit Sharma” were heard at the Wankhede Stadium.🔥
The Raja @ImRo45 🐐
This is Aura of Rohit Sharma…🔥The Raja of Mumbai 😍pic.twitter.com/5WWQGM65Tl
— ❖ Abhijeet 45 ❖ (@Abhijeet042729) December 14, 2025