Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఇవాళే.. వారికి తుదిజట్టులో చోటుదక్కేనా..

ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కుసైతం బీసీసీఐ ఇవాళ టీమిండియా జట్టును ప్రకటించనుంది.

Champions Trophy 2025

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ -2025 ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పాకిస్థాన్ వేదికగా జరిగే ఈ టోర్నీలో భారత్ జట్టు మాత్రం హైబ్రిడ్ మోడల్ పద్దతిలో మ్యాచ్ లు ఆడనుంది. దుబాయ్ వేదికగా భారత్ ఆడే మ్యాచ్ లు జరగనున్నాయి. ఇప్పటికే మ్యాచ్ ల షెడ్యూల్ సైతం విడుదలైంది. భారత్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే, టోర్నీకి వెళ్లే టీమిండియా జట్టును బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. ఇవాళ మధ్యాహ్నం చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలో విలేకరుల సమావేశం నిర్వహించి పదిహేను మంది ఆటగాళ్లతో కూడిన జట్టు వివరాలను ప్రకటించనున్నారు.

Also Read: Rinku Singh : సమాజ్‌వాదీ పార్టీ ఎంపీతో టీమ్ఇండియా క్రికెట‌ర్ రింకూసింగ్ నిశ్చితార్థం?

ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఇంగ్లాండ్ జట్టుతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ కుసైతం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జట్టును ప్రకటించనుంది. ఈనెల 22న ఇంగ్లాండ్ తో ఆరంభమయ్యే అయిదు టీ20ల సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చేనెల 6న మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. ఇవాళ ఉదయం వాంఖడే స్టేడియంలో సెలక్షన్ కమిటీ సమావేశం తరువాత ఇంగ్లండ్ వన్డే సిరీస్ కోసం, ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును వెల్లడించే అవకాశం ఉంది. అయితే, తుదిజట్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాను ఎంపిక చేస్తారా.. లేదా.. అనే విషయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం బుమ్రా వెన్నుముక గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. అతను ఎంత వరకు కోలుకున్నాడనే విషయంపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో తుది జట్టులో బుమ్రాను చేర్చుతారా.. లేదా అనే విషయంపై ఇవాళ స్పష్టత రానుంది.

Also Read: Dinesh Karthik stunning catch : సౌతాఫ్రికా గ‌డ్డ పై దినేశ్ కార్తీక్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. సూప‌ర్ మేన్ అంటున్న నెటిజ‌న్లు.. వీడియో

వికెట్ కీపర్ ఎంపికపైన తీవ్ర పోటీ నెలకొంది. వికెట్ కీపర్- బ్యాటర్ విషయానికొస్తే రిషబ్ పంత్, సంజు శాంసన్, జురెల్, ఇషాన్ కిషన్ మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. అయితే, రిషబ్ పంత్ వైపే సెలక్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా పాత్ర కీలకమని సెలక్టర్లు భావిస్తున్నారు. బౌలింగ్ లోనూ, బ్యాటింగ్ లోనూ హార్దిక్ రాణించగలడు. దీంతో హార్దిక్ పాండ్యా తుది జట్టులో చేరే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. మరోవైపు స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో బుమ్రా, మహ్మద్ షమీతోపాటు మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ లకు సెలక్టర్లు ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.

 

ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ కోసం భారత్ జట్టులో కరుణ్ నాయర్ చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కరుణ్ నాయర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఏడు మ్యాచ్ లలో సగటున 752 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు ఉన్నాయి. అయితే, కరుణ్ నాయర్ ను ఇంగ్లండ్ తో జరిగే మూడు వన్డేల సిరీస్ కు సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశం ఉండగా.. ఛాంపియన్ ట్రోఫీలోకూడా అవకాశం కల్పిస్తారా..? అనే విషయంపై ఇవాళ స్పష్టత రానుంది. కరుణ్ నాయర్ తుది జట్టులో చేరితే ఎవరిని పక్కన పెడతారనే విషయంపై చర్చపైనా జరుగుతుంది.

 

ఛాంపియన్స్ ట్రోఫీకి 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, యశస్వీ జైస్వాల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ర్పీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.