Rinku Singh : సమాజ్‌వాదీ పార్టీ ఎంపీతో టీమ్ఇండియా క్రికెటర్ రింకూసింగ్ నిశ్చితార్థం?
టీమ్ఇండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ నిశ్చితార్థం జరిగింది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Rinku Singh gets engaged to MP Priya Saroj reports
Rinku Singh – Priya Saroj : టీమ్ఇండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ నిశ్చితార్థం జరిగింది అంటూ ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో అతడి నిశ్చితార్థం జరిగినట్లు సదరు వార్తల సారాంశం. అయితే.. దీని పై అటు రింకూ గానీ, ఇటు ప్రియా కానీ స్పందించలేదు. వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేగానీ అసలు నిజం ఏంటో తెలియదు.
కాగా.. రింకూ చెల్లెలు నేహా సింగ్ తన అన్నతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేసింది. అందులో వారి ఇళ్లు అలరించినట్లుగా ఉండడంతో పాటు బంధువుల కోలాహలం కనిపిస్తుండడంతో నెటిజన్లు రింకూ నిశ్చితార్థం జరిగిందని అంచనాకు వస్తున్నారు.
ప్రియా సరోజ్ ఎవరు..?
ప్రియా సరోజ్ సమాజ్‌వాదీ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యురాలు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్‌లోని మచ్లిషహర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కురాలు ప్రియానే కావడం విశేషం.
ఇక రింకూ సింగ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ 2023లో అద్భుత ప్రదర్శనతో రింకూ సింగ్ వెలుగులోకి వచ్చాడు. ఓ మ్యాచ్‌లో చివరి ఓవర్‌లోని చివరి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచి కేకేఆర్‌కు నమ్మశక్యం గానీ విజయాన్ని అందించాడు. ఆ సీజన్‌లో 14 మ్యాచుల్లో 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమ్ఇండియాలో చోటు దక్కించుకున్నాడు.
టీమ్ఇండియా తరుపున రింకూ సింగ్ రెండు వన్డేలు, 30 టీ20లు ఆడాడు. వన్డేల్లో 55 పరుగులు మాత్రమే చేశాడు. టీ20ల్లో 46.1 సగటుతో 507 పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయినప్పటికి 2024లో అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20 లకు వీడ్కోలు చెప్పడంతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే పనిలో ఉన్నాడు రింకూ సింగ్.
ఇంగ్లాండ్‌తో జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు ఎంపిక అయ్యాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు రూ.13 కోట్లకు రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍
– Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025