Rohit Sharma to retire after ICC Champions Trophy 2025
గత కొన్నాళ్లుగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలం కావడంతో హిట్‌మ్యాన్ రిటైర్‌మెంట్ తీసుకోవాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఈ క్రమంలో ఆసీస్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తరువాత సుదీర్ఘ పార్మాట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై చెబుతాడనే ప్రచారం సాగింది. అయితే.. అలాంటిది ఏమీ జరగలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత తన భవిష్యత్తు పై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే రోహిత్ శర్మకు బీసీసీఐ అల్టిమేటం జారీ చేసినట్లుగా కథనాలు వస్తున్నాయి.
ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. రోహిత్ శర్మ సారథ్యంలోనే భారత్ బరిలోకి దిగనుంది. ఈ మెగాటోర్నీలో జట్టును విజేతగా నిలిపి సగ్వరంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాలని భావిస్తున్నట్లుగా కొన్ని కథనాలు వస్తున్నాయి. గతేడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్ 2024 విజయంతో పొట్టి ఫార్మాట్‌లకు కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
NTR : నాటు నాటు స్టెప్పుతో ఫిఫా వరల్డ్ కప్ పోస్టర్.. ఎన్టీఆర్ పేరుతో.. అదిరింది బాసూ..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 సీజన్‌తో పాటు వన్డే ప్రపంచకప్ 2027 కోసం టీమ్‌ను సిద్ధం చేసే పనిలో ఉంది బీసీసీఐ. ఈ క్రమంలో ఇప్పుడు సీనియర్ ఆటగాళ్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయా ఆయా ఆటగాళ్ల భవితవ్యంపై ఓ స్పష్టత కోరే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నారు.
హిట్‌మ్యాన్‌తో పోలిస్తే కోహ్లి ఫిట్‌నెస్ ఎంతో బాగుంటుందని, ఈ క్రమంలో అతడు మరికొన్నాళ్ల పాటు ఆటలో కొనసాగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటిస్తే.. అప్పడు రెండు ఫార్మాట్లకు కెప్టెన్లను నియమించాల్సి ఉంటుంది. వన్డే కెప్టెన్సీ రేసులో గిల్, పంత్ ఉండగా, టెస్టు సారథ్య రేసులో పంత్ పాటు బుమ్రా ఉన్నాడు.
‘ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత రోహిత్ శర్మ భవితవ్యంపై గత సమావేశంలోనే సెలెక్టర్లు, బోర్డు చర్చలు జరిపాయి. అయితే.. అప్పుడు రోహిత్ కాస్త సమయం కావాలని కోరాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తరువాత అతడు నిర్ణయం తీసుకోవచ్చు. డబ్ల్యూటీసీ సైకిల్‌తో పాటు వన్డే ప్రపంచకప్ కోసం జట్టులో మార్పులు చేయాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరితో చర్చలు జరుపుతోంది. నాయకత్వ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అనేది కీలకం. బుమ్రా నాయకత్వ సారథ్యం పై ఎవ్వరికి ఎలాంటి అనుమాలు లేవు. అయితే.. గాయాల బెడద అతడికి ఆటంకం కావొచ్చు. ఈ క్రమంలో నిలకడగా ఆడే ప్లేయర్ల వైపు టీమ్ మేనేజ్‌మెంట్ మొగ్గు చూపనుంది. కెప్టెన్సీ రేసులో రిషబ్ పంత్ బలమైన పోటీదారుడు. అతడితో పాటు యశస్వి సైతం రేసులో ఉన్నాడు.’ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.