Rohit Speaks His Heart Out After Embarrassing Series Loss vs NZ
IND vs NZ : సొంతగడ్డపై భారత జట్టుకు ఘోర పరాభవం. న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో చిత్తుగా ఓడి సిరీస్‌ను కోల్పోయింది టీమ్ఇండియా. 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచుల సిరీస్‌లో భారత్ తొలిసారి వైట్‌వాష్‌కు గురైంది.
వాంఖడే వేదికగా జరిగిన మూడో టెస్టు మ్యాచులో 147 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయింది. 121 పరుగులకే ఆలౌటైంది. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (1), యశస్వి జైస్వాల్ (5), సర్ఫరాజ్ ఖాన్ (1), రవీంద్ర జడేజా (6) లు దారుణంగా విఫలం అయ్యారు. రిషబ్ పంత్ (64) ఒక్కడే పోరాడాడు. అయితే.. పంత్ ఔట్ వివాదాస్పదమైంది.
Sachin Tendulkar: కారణం ఏమిటి..? టీమిండియా ఓటమి తరువాత సచిన్ టెండూల్కర్ ప్రశ్నల వర్షం
అది నాటౌట్ అంటూ ఫీల్డ్ అంపైర్‌తో పంత్ మొరపెట్టుకున్న థర్డ్ అంపైర్ ఔట్ ఇవ్వడంతో పంత్ చేసేది ఏమీ లేక నిరాశగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇక మ్యాచ్ ఓటమి అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని అన్నాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టమన్నాడు. గెలుస్తామన్న ఇలాంటి మ్యాచ్‌ను కోల్పోవడం తమను తీవ్రంగా బాధిస్తోందన్నాడు. తన కెరీర్‌లో ఇదే అథమ దశ అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.
జట్టుగా అత్యత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయామన్నాడు. నాయకత్వంలో, బ్యాటింగ్‌లో తాను అత్యుత్తమంగా లేనన్నాడు. జట్టును సరైన విధంగా నడిపించలేకపోయానన్నాడు. ఇలాంటి పిచ్‌పై ఎలా ఆడాలన్నది పంత్, సుందర్ చూపించారన్నాడు. బ్యాటర్ల వైఫలం ఆందోళన కలిగించేదన్నాడు. ప్రస్తుతం తన దృష్టి అంతా ఆసీస్ సిరీస్‌పైనే ఉందని, దాని తరువాత ఏం జరుగుతుందనేది చూడాలన్నాడు.
పంత్ ఔట్ పై స్పందిస్తూ..
పంత్ ఔట్ విషయంలో అంపైర్ నిర్ణయాన్ని రోహిత్ శర్మ తప్పుబట్టాడు. ఔట్ అని స్పష్టంగా తెలియనప్పుడు ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతో థర్డ్ అంపైర్ ఏకీభవించాల్సి ఉందన్నాడు. ఆ సమయంలో పంత్ బ్యాట్ ప్యాడ్ తాకిందని అందరికి తెలుసునని, అయితే ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ ఎందుకు వ్యతిరేకించాడో తనకు అర్థం కాలేదన్నాడు. పంత్ వికెట్ ఎంతో కీలకం అని, అప్పటికే అతడు క్రీజులో కుదురుకుని ఉన్నాడన్నాడు. ఒకవేళ థర్డ్ అంపైర్ గనుక అలాంటి నిర్ణయం తీసుకోకపోయి ఉంటే.. ఫలితం మరోలా వచ్చి ఉండేదని చెప్పారు. పంత్ ఔట్ అయిన తరువాత త్వరగా వికెట్లు కోల్పోయామన్నాడు.
Teamindia: డబ్ల్యూటీసీ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయిన భారత్.. ఆసీస్ టూర్ అత్యంత కీలకం
అజాజ్ పటేల్ వేసిన 22వ ఓవర్‌లో నాలుగో బంతిని పంత్ ముందుకు వచ్చి డిఫెన్స్ ఆడాడు. బాల్ ప్యాడ్‌కు తాగి గాల్లోకి లేచింది. వికెట్ కీపర్ అందుకున్నాడు. కివీస్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో న్యూజిలాండ్ రివ్య్వూ తీసుకుంది. రీప్లేలో బ్యాట్ దగ్గర నుంచి బంతి వెళ్లినప్పుడు అల్ట్రాఎడ్జ్‌లో గీతలు వచ్చాయి. అయితే.. అదే సమయంలో బ్యాడ్ ప్యాడ్‌కు తగిలినట్లు కనిపించింది. ప్యాడ్‌కు బ్యాట్ తగలడంతోనే అల్ట్రా ఎడ్జ్‌లో అలా చూపించిందని పంత్ మైదానంలోని అంపైర్లకు వివరించినా ప్రయోజనం లేకపోయింది. థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు.