Teamindia: డబ్ల్యూటీసీ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయిన భారత్.. ఆసీస్ టూర్ అత్యంత కీలకం
వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లు ఓడిపోవడంతో భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ లో స్థానం దక్కించుకోవటం క్లిష్టతరంగా మారింది.

Team india
WTC 2024 Points Table: న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ లలోనూ భారత్ జట్టు ఓటమి పాలైంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్(డబ్ల్యూటీసీ) 2024 పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానాన్ని కోల్పోయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు 62.50శాతంతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇండియా 58.33శాతంతో రెండో స్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక జట్టు 55.56 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. భారత్ జట్టుపై వరుసగా మూడు టెస్ట్ మ్యాచ్ లలో విజయం సాధించిన కివీస్ జట్టు 54.55 శాతంతో నాల్గో స్థానంలో కొనసాగుతుంది. ఐదో స్థానంలో 54.17 శాతంతో సౌతాఫ్రికా జట్టు నిలిచింది.
వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లు ఓడిపోవడంతో భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ లో స్థానం దక్కించుకోవటం క్లిష్టతరంగా మారింది. ఇక ఈనెల చివరిలో ప్రారంభమయ్యే బోర్డర్ -గవాస్కర్ ట్రోపీ టీమిండియాకు అత్యంత కీలకం కానుంది. ఈ ట్రోపీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియా జట్టుతో ఐదు టెస్టు మ్యాచ్ లు ఆడుతుంది. ఈ ఐదు మ్యాచ్ లలో కనీసం నాలుగు టెస్టుల్లోనైనా గెలవాలి.. మరో టెస్టు ను డ్రాగా ముగించాల్సి ఉంటుంది. ఒక్కటి ఓడినా ఫైనల్ అవాకాశాలు మరింత సంక్లిష్టంగా మారనున్నాయి. ఒకవేళ నాలుగు టెస్టుల్లో విజయం సాధించి.. ఒక టెస్టులో ఓడిపోతే.. మిగిలిన జట్ల గెలుపోటములపై భారత్ ఫైనల్ అవకాశాలు ఆధారపడా ఉంటాయి.
🚨 WTC POINTS TABLE…!!! 🚨 pic.twitter.com/rc7oGYBPkz
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 3, 2024