Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. 50వికెట్ల క్లబ్‌లో అశ్విన్ తరువాత రెండో భారత్ బౌలర్‌గా రికార్డు
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న జడేజా.. అశ్విన్ తరువాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

Ravindra Jadeja,
Ravindra Jadeja : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య వాఖండే స్టేడియంలో మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు పట్టుబిగించింది. భారత్ స్పిన్ బౌలింగ్ దాటికి న్యూజిలాండ్ బ్యాటర్లు తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టారు. తొలి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు, రవిచంద్ర అశ్విన్ మూడు వికెట్లు పడగొట్టారు. అయితే, రెండు ఇన్నింగ్స్ లలో కలిపి జడేజా తొమ్మిది వికెట్లు పడగొట్టి కివీస్ పై భారత్ జట్టు పట్టు సాధించడంలో కీలక భూమిక పోషించాడు. ఇదే క్రమంలో సరికొత్త రికార్డును జడేజా సొంతం చేసుకున్నాడు.
Also Read: IND vs NZ: కివీస్‌తో మూడో టెస్ట్.. పట్టు బిగించిన భారత్.. ఇక భారమంతా బ్యాటర్లదే
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 లో 50 వికెట్లు పూర్తి చేసుకున్న జడేజా.. అశ్విన్ తరువాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత డబ్ల్యూటీసీ సీజన్ లో ఇప్పటి వరకు అశ్విన్ 62 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా 50 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ (51 వికెట్లు) ఉన్నాడు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రా 45 వికెట్లు తీసి ఆరు స్థానంలో ఉన్నాడు. గత డబ్ల్యూటీసీ సీజన్లలో అశ్విన్ మినహా 50 వికెట్లు తీసిన భారత్ బౌలర్ ఎవరూ లేరు. ఆ రికార్డును జడేజా అధిగమించాడు. రెండో భారత్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు.
Also Read: IND vs NZ: రిషబ్ పంత్ ఉండగా క్రీజును వదిలేస్తావా..! రిజల్ట్ అలానే ఉంటది మరి.. వీడియో వైరల్
డబ్ల్యూటీసీ 2019-21 సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రవిచంద్ర అశ్విన్ (71 వికెట్లు) అగ్ర స్థానంలో నిలిచాడు. డబ్ల్యూటీసీ 2021-23 సీజన్ లో 58 వికెట్లతో అశ్విన్ మూడో స్థానంలో నిలిచాడు. అయితే, ఆ రెండు సీజన్ లలో భారత్ జట్టు తరపున అశ్విన్ ఒక్కడే 50 వికెట్ల జాబితాలో ఉన్నాడు. ప్రస్తుతం డబ్ల్యూటీసీ 2023-25 సీజన్ లో ఇప్పటి వరకు అశ్విన్ (62వికెట్లతో) అగ్రస్థానంలో ఉండగా.. రవీంద్ర జడేజా (50 వికెట్లతో) మూడో స్థానంలో నిలిచాడు.