IND vs NZ: కివీస్‌తో మూడో టెస్ట్.. పట్టు బిగించిన భారత్.. ఇక భారమంతా బ్యాటర్లదే

భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్ర అశ్విన్ మూడు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ చెరో వికెట్

IND vs NZ: కివీస్‌తో మూడో టెస్ట్.. పట్టు బిగించిన భారత్.. ఇక భారమంతా బ్యాటర్లదే

IND vs NZ 3rd test day-2

Updated On : November 2, 2024 / 5:38 PM IST

IND vs NZ 3rd Test: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టెస్టులో భారత్ జట్టు పట్టు బిగించింది. రెండో రోజు (శనివారం) మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించారు. రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ (60), శుభ్ మన్ గిల్ (90) రాణించడంతో ప్రత్యర్థి జట్టుపై భారత్ స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఆ తరువాత రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ మొదలు పెట్టిన కివీస్ బ్యాటర్లకు భారత్ స్పిన్నర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా జడేజా, అశ్విన్ స్పిన్ బౌలింగ్ దాటికి కివీస్ బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయారు. ఫలితంగా రెండోరోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. తద్వారా భారత్ జట్టుపై 143 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Also Read: IND vs NZ: రిషబ్ పంత్ ఉండగా క్రీజును వదిలేస్తావా..! రిజల్ట్ అలానే ఉంటది మరి.. వీడియో వైరల్

భారత్ బౌలర్లలో రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టగా.. రవిచంద్ర అశ్విన్ మూడు వికెట్లు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ పడగొట్టారు. రెండో ఇన్నింగ్స్ లో కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్ (51) మినహా మిగిలిన బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలంకు వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. మొత్తానికి మూడో టెస్టులో భారత్ జట్టు కివీస్ పై పట్టు సాధించగా.. విజయం సాధించాలంటే భారత్ బ్యాటర్ల ప్రదర్శనపైనే ఆధారపడి ఉంది. ఈ క్రమంలో ఆదివారం జరిగే మ్యాచ్ కీలకంగా మారనుంది. మరి భారత బ్యాటర్లు క్రీజులో ఎక్కువ సేపు నిలబడి న్యూజిలాండ్ నిర్దేశించే లక్ష్యాన్ని ఛేదిస్తారా.. గత రెండు మ్యాచ్ ల్లోలా వెంటవెంటనే పెవిలియన్ బాట పడతారా అని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.