Sachin Tendulkar: కారణం ఏమిటి..? టీమిండియా ఓటమి తరువాత సచిన్ టెండూల్కర్ ప్రశ్నల వర్షం

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. తద్వారా మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 0-3తో టీమిండియా వైట్ వాష్ అయింది.

Sachin Tendulkar: కారణం ఏమిటి..? టీమిండియా ఓటమి తరువాత సచిన్ టెండూల్కర్ ప్రశ్నల వర్షం

Sachin Tendulkar

Updated On : November 4, 2024 / 7:12 AM IST

IND vs NZ test : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. తద్వారా మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 0-3తో టీమిండియా వైట్ వాష్ అయింది. స్వదేశంలో అత్యంత చెత్త రికార్డు ఇదే. పంత్ ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. స్వదేశంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ టెస్టుల సిరీస్ లో భారత్ వైట్ వాష్ కావడం ఇదే తొలిసారి. గతంలో రెండు సార్లు మాత్రమే టీమిండియా సొంతగడ్డపై వైట్ వాష్ అయింది. 2000లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో.. అదేవిధంగా 1980లో ఇంగ్లాండ్ చేతిలో 1-0తో వైట్ వాష్ కు గురైంది. అలాగే 1983 తరువాత ఓ సిరీస్ లో భారత్ వరుసగా మూడు టెస్టులు ఓడటం ఇదే తొలిసారి.

Also Read: Teamindia: డబ్ల్యూటీసీ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయిన భారత్.. ఆసీస్ టూర్ అత్యంత కీలకం

టీమిండియా ఘోర ఓటమిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘోర పరాభవంపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నా కెరీర్ లో ఇదే అథమ దశ. ఈ ఓటమికి సారథిగా పూర్తి బాధ్యత నాధే అన్నాడు. సొంతగడ్డపై సిరీస్ ఓటమి జీర్ణించుకోవడం చాలా కష్టం. గెలుస్తామనుకున్న ఇలాంటి మ్యాచ్ ను కోల్పోవడం మరింత తీవ్రంగా బాధిస్తోందని రోహిత్ పేర్కొన్నారు. బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు పరుగులు రాబట్టలేకపోతుండటం ఆందోళన కలిగించేదే. ఈ సిరిసీ్ ఓటమి నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన మాకు అతిపెద్ద సవాలే అని రోహిత్ చెప్పారు. టీమిండియా ఓటమిపై సచిన్ టెండూల్కర్ ట్విటర్ ద్వారా స్పందించారు.

 

సొంతగడ్డపై 0-3తో టెస్టు సిరీస్ కోల్పోవడం మింగలేని చేదు గుళిక. ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది. సన్నద్ధత సరిగా లేక పోవడం వల్ల ఇలా జరిగిందా..? లేదా పేలవ షాట్ సెలక్షన్ దెబ్బతీసిందా? లేదా మ్యాచ్ ప్రాక్టీస్ లోపించడం దీనికి కారణమా అన్నది తెలుసుకోవాలి. శుబ్ మన్ గిల్ తొలి ఇన్నింగ్స్ లో నిలకడను ప్రదర్శించాడు. రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా ఆడాడు. అతను సింప్లీ సూపర్బ్. సిరీస్ లో నిలకడగా ఆడిన న్యూజిలాండ్ జట్టుకు విజయంలో పూర్తి క్రెడిట్ దక్కుతుంది. భారత్ గడ్డ మీద భారత జట్టుపై 3-0తో విజయం సాధించడం మంచి ఫలితం అని సచిన్ పేర్కొన్నాడు.