RCB vs PBKS: రసవత్తర పోరులో గెలుపు రాయల్ ఛాలెంజర్స్‌దే.. ప్లే ఆఫ్స్‌కు కోహ్లీ సేన!
షార్జా మైదానంలో జరిగిన రసవత్తర పోరులో కోహ్లీ సేన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది.

Kohli Sena
RCB vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్‌లో 48వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య షార్జా మైదానంలో జరిగిన రసవత్తర పోరులో కోహ్లీ సేన విజయం సాధించి ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో, బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది బెంగళూరు జట్టు.
అనంతరం 165పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు.. మొదట్లో జాగ్రత్తగా ఆడిన వరుసగా వికెట్లు పడడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. యుజువేంద్ర చాహల్ పంజాబ్ బ్యాట్స్‌మెన్‌లను వరుసగా పెవీలియన్ పంపించి పంజాబ్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. చివరకు పంజాబ్ జట్టు 6పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతయ్యాయి. ఇప్పటికే ఢిల్లీ, చెన్నై ప్లేఆఫ్స్‌లో అడుగు పెట్టగా.. బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది.
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ, దేవదత్ పాడిక్కల్ క్రీజులోకి రాగా.. తొలి ఆరు ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 55 పరుగులు జోడించారు. గ్లెన్ మాక్స్‌వెల్(57) అర్ధ సెంచరీ చేయగా ఓపెనర్లు దేవ్‌దత్ పాడిక్కల్(40), విరాట్ కోహ్లి(25), డి విలియర్స్(23) పర్వాలేదని అనిపించారు. షాబాజ్ అహ్మద్ 8పరుగులు మాత్రమే చెయ్యగా.. డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్ డకౌట్ అయ్యారు. పంజాబ్ బౌలర్లలో హెన్రిక్స్, మహమ్మద్ షమి చెరో మూడు వికెట్లు తీశారు.