IPL 2025 : ఆర్‌సీబీ పూర్తి షెడ్యూల్ ఇదే.. మ్యాచ్‌లు, తేదీలు, సమయాలు, వేదికలు, ప్ర‌త్య‌ర్థులు

ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు సంబంధించిన ఆర్‌సీబీ పూర్తి షెడ్యూల్ ఇక్క‌డ ఉంది.

Royal Challengers Bengaluru full Schedule in IPL 2025 here

గ‌త 17 సీజ‌న్లుగా ఐపీఎల్ ట్రోఫీకి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) అంద‌ని ద్రాక్ష‌గానే ఉంది. ప్ర‌తీ సీజ‌న్‌కు ముందు క‌ప్పు మ‌న‌దే అంటూ రావ‌డం ఊసురుమ‌నిపించ‌డం ఆర్‌సీబీకి అల‌వాటుగా మారింది. ఈ క్ర‌మంలో ఐపీఎల్ 2025 సీజ‌న్‌కు ముందు నిర్వ‌హించిన మెగావేలంలో ఆర్‌సీబీ త‌మ‌కు కావాల్సిన ప్లేయ‌ర్లును కొనుగోలు చేసింది.

మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో ఇన్నాళ్లుగా అంద‌ని ద్రాక్ష‌లా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవాల‌ని ఆ జ‌ట్టు ఆట‌గాళ్ల‌తో పాటు ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆర్‌సీబీ త‌న తొలి మ్యాచ్‌ను మార్చి 22న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

IND vs ENG : భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌..

ఈ మ్యాచ్ కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలో ఆర్‌సీబీ ఈ సీజ‌న్‌లో బ‌రిలోకి దిగ‌నుంది.

ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ షెడ్యూల్ ఇదే..

మార్చి 22న – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో – ఈడెన్ గార్డెన్స్‌లో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మార్చి 28న – చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో – చిద‌రంబ‌రం స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 2న – గుజ‌రాత్ టైటాన్స్‌తో – చిన్న‌స్వామి స్టేడియం – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 7న – ముంబై ఇండియ‌న్స్‌తో – వాంఖ‌డే స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 10న – ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో – చిన్న‌స్వామి స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 13న – రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో – స‌వాయ్ మాన్ సింగ్ స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 18న – పంజాబ్ కింగ్స్‌తో – చిన్న‌స్వామి స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 20న – పంజాబ్ కింగ్స్‌తో – మ‌హారాజా యాద‌వీంద్ర సింగ్ స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు

IPL 2025 : స‌న్‌రైజ‌ర్స్ హైదారాబాద్ పూర్తి షెడ్యూల్.. మ్యాచ్‌లు, తేదీలు, సమయాలు, వేదికలు

ఏప్రిల్ 24న – రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో – చిన్న‌స్వామి స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
ఏప్రిల్ 27న – ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో – అరుణ్ జైట్లీ స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 3న – చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో – చిన్న‌స్వామి స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 9న – ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో – ఎకానా స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 13న – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో – చిన్న‌స్వామి స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు
మే 17న – కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో – చిన్న‌స్వామి స్టేడియంలో – రాత్రి 7.30 గంట‌ల‌కు