IND vs ENG : భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌..

భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్‌కు భారీ షాక్ త‌గిలింది.

IND vs ENG : భార‌త్‌తో టెస్టు సిరీస్‌కు ముందే ఇంగ్లాండ్‌కు భారీ షాక్‌..

Massive blow for England ahead of Test series against India

Updated On : March 13, 2025 / 9:27 PM IST

భార‌త్ జ‌ట్టు జూన్‌లో ఇంగ్లాండ్‌లో ప‌ర్య‌టించ‌నుంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భార‌త జ‌ట్టు ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను ఆడ‌నుంది. ఈ సిరీస్ కు ఇంకా రెండున్న‌ర నెల‌ల‌ స‌మ‌యం ఉంది. అయిన‌ప్ప‌టికి ఇంగ్లాండ్ జ‌ట్టుకు గ‌ట్టి షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ మార్క్‌వుడ్ ఈ సిరీస్‌కు దూరం అయ్యాడు. ఈ విష‌యాన్నిఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది.

గ‌త కొన్నాళ్లుగా మార్క్ వుడ్ మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డు శ‌స్త్ర‌చికిత్స చేయించుకున్నాడు. ఈ శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం అయిన‌ట్లు ఈసీబీ తెలిపింది. అత‌డు పూర్తిగా కోలుకునేందుకు నాలుగు నెల‌ల స‌మ‌యం పడుతుంద‌ని వైద్యులు తెలిపిన‌ట్లు వెల్ల‌డించింది. దీంతో అత‌డు భార‌త్‌తో సిరీస్‌కు దూరం అయిన‌ట్లే.

IPL 2025 : చ‌రిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో కోహ్లీ.. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఒకే ఒక్క‌డు..

ఇటీవ‌ల ముగిసిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో ఇంగ్లాండ్ త‌రుపున మార్క్‌వుడ్ ఆడాడు. ఈ టోర్నీలో ఇంగ్లాండ్ దారుణంగా నిరాశ‌ప‌రిచింది. గ్రూప్‌-బిలో అట్ట‌డుగు స్థానంలో నిలిచి సెమీస్ చేర‌కుండానే నిష్ర్క‌మించింది. మార్క్‌వుడ్ గ‌త సంవ‌త్స‌రం కాలంగా మోకాలి స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నాడ‌ని, ఛాంపియ‌న్స్ ట్రోఫీ2025లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ లో అది తీవ్ర‌మైన‌ట్లుగా ఈసీబీ తెలిపింది.

కాగా.. వుడ్ నాలుగు నెల‌ల పాటు ఆట‌కు దూరంగా ఉండ‌డం ఐపీఎల్ 2025 సీజ‌న్‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌దు. ఎందుకంటే అత‌డిని మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయ‌లేదు. జూలై 2025 చివ‌రి నాటికి వుడ్ రీ ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంది.

IPL 2025 : హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ముంబై కెప్టెన్ ఎవ‌రు? ప్ర‌ధానంగా ముగ్గురి మ‌ధ్యే పోటీ?

భార‌త్‌, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..

తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్‌ 24 వ‌ర‌కు – హెడింగ్లీ
రెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వ‌ర‌కు – ఎడ్జ్‌బాస్టన్
మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వ‌ర‌కు – లార్డ్స్‌
నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వ‌ర‌కు – ఓల్డ్ ట్రాఫోర్డ్
ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగ‌స్టు 4 వ‌ర‌కు – కెన్నింగ్టన్ ఓవల్