IPL 2025 : చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలోనే ఒకే ఒక్కడు..
వరుసగా 18 సీజన్ల పాటు ఒకే జట్టుకు ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కనున్నాడు.

Virat eyes to create history can become first Indian to achieve this legendary feat during IPL 2025
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఐపీఎల్ 2025 పై పడింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభం కానుంది. ఇక టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. వరుసగా 18 సీజన్ల పాటు ఒకే జట్టుకు ఆడిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డులకు ఎక్కనున్నాడు.
2008లో ఐపీఎల్ ప్రారంభమైంది. తొలి సీజన్ నుంచి ఇప్పటి వరకు కూడా విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంఛైజీ తరుపున మాత్రమే ఆడుతున్నాడు. తొలి సీజన్ నుంచి ధోని, రోహిత్ శర్మ లు ఐపీఎల్ ఆడుతున్నప్పటికి వారిద్దరు ఒకే జట్టు తరుపున ఆడలేదు. ఐపీఎల్ ఆరంభ సీజన్లలో రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.
IPL 2025 : హార్దిక్ పాండ్యా గైర్హాజరీలో ముంబై కెప్టెన్ ఎవరు? ప్రధానంగా ముగ్గురి మధ్యే పోటీ?
ఇక మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ తరుపుననే ఆడుతున్నాడు. అయితే.. బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా 2016, 2017 సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ పై బ్యాన్ విధించారు. ఆ రెండు సంవత్సరాలు ధోని.. రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తరుపున ఆడాడు.
ఒక్క సెంచరీ చేస్తే..
ఇప్పటి వరకు కోహ్లీ ఐపీఎల్‌లో 252 మ్యాచ్‌లు ఆడాడు. 38.7 సగటు, 132 స్ట్రైక్‌రేటుతో 8004 పరుగులు చేశాడు. ఇందులో 8 శతకాలు 55 అర్థశతకాలు ఉన్నాయి. ఈ క్రమంలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ అడుగు దూరంలో ఉన్నాడు.
టీ20 క్రికెట్‌లో భారత్ తరుపున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీనే కొనసాగుతున్నాడు. ఐపీఎల్‌లో 8 సెంచరీలు చేసిన కోహ్లీ, అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ శతకం బాదాడు. 2022లో టీ20 ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్ పై ఈ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ 18వ సీజన్‌లో కోహ్లీ ఒక్క సెంచరీ చేస్తే.. టీ20ల్లో 10 సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టిస్తాడు.
IPL 2025 : సన్‌రైజర్స్ హైదారాబాద్ పూర్తి షెడ్యూల్.. మ్యాచ్‌లు, తేదీలు, సమయాలు, వేదికలు
టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రిస్‌గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ విధ్వంసకర వీరుడు ఏకంగా 22 శతకాలు బాదాడు. ఆ తరువాత 11 శతకాలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో కోహ్లీ 9 శతకాలతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ, జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్, మైకేల్ క్లింగర్, ఆరోన్ ఫించ్, రిలీ రూసోలు తలా 8 శతకాలతో నాలుగో స్థానంలో ఉన్నారు.
ఐపీఎల్ 18 వ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.