IPL 2025 : సన్‌రైజర్స్ హైదారాబాద్ పూర్తి షెడ్యూల్.. మ్యాచ్‌లు, తేదీలు, సమయాలు, వేదికలు
ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ ఇక్కడ ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసింది. భారత జట్టు విజేతగా నిలవడంతో యావత్ టీమ్ఇండియా అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 పై పడింది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభం కానుంది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో అదిరిపోయే ప్రదర్శనతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే.. ఫైనల్ మ్యాచ్‌లో అనూహ్యంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) చేతిలో చిత్తైంది. పాట్ కమిన్స్ నేతృత్వంలోని సన్‌రైజర్స్ గత సీజన్‌లో మంచి క్రికెట్ ఆడింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల ఓపెనింగ్ జోడీ టోర్నమెంట్‌లోనే అత్యుత్తమ జోడీగా నిలిచింది.
పాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ ను మెగావేలానికి ముందు సన్‌రైజర్స్ రిటైన్ చేసుకుంది. ఇక వేలంలోనూ మంచి ఆటగాళ్లను సొంతం చేసుకుంది. టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీతో పాటు వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌లను తీసుకుంది.
2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్ నాయకత్వంలో ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆ తరువాత మరోసారి ఐపీఎల్ ట్రోఫీని ఎస్ఆర్‌హెచ్ అందుకోలేదు. గతేడాది తృటిలో కప్పును కోల్పోయింది. అయితే.. ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా నిలవాలని గట్టి పట్టుదలతో ఉంది. ఐపీఎల్ 18వ సీజన్‌లో ఎస్ఆర్‌హెచ్ తన తొలి మ్యాచ్‌ను రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానంలో మార్చి 23న ఈ మ్యాచ్ జరగనుంది.
లీగ్ దశలో లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్‌తో సన్‌రైజర్స్ రెండుసార్లు తలపడనుంది.
ఐపీఎల్ 2025లో ఎస్ఆర్‌హెచ్ పూర్తి షెడ్యూల్ ఇదే..
మార్చి 23న – రాజస్థాన్ రాయల్స్ తో – మధ్యాహ్నం 3:30 గంటలకు – ఉప్పల్ స్టేడియం
మార్చి 27న – లక్నో సూపర్ జెయింట్స్‌తో – రాత్రి 7.30 గంటలకు – ఉప్పల్ స్టేడియం
మార్చి 30 న – ఢిల్లీ క్యాపిటల్స్‌తో – మధ్యాహ్నం 3.30 గంటలకు – అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)
ఏప్రిల్ 3న – కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో – రాత్రి 7.30 గంటలకు – ఈడెన్ గార్డెన్స్
ఏప్రిల్ 6న – గుజరాత్ టైటాన్స్ – రాత్రి 7.30 గంలకు – ఉప్పల్ స్టేడియం
ఏప్రిల్ 12న – పంజాబ్ కింగ్స్ – రాత్రి 7.30 గంటలకు – ఉప్పల్ స్టేడియం
ఏప్రిల్ 17న – ముంబై ఇండియ్సన్‌తో – రాత్రి 7.30 గంటలకు – వాంఖడే స్టేడియం
ఏప్రిల్ 23 న – ముంబై ఇండియన్స్‌తో – రాత్రి 7.30 గంటలకు – ఉప్పల్ స్టేడియం
ఏప్రిల్ 25న – చెన్నై సూపర్ కింగ్స్‌తో – రాత్రి 7.30 గంటలకు – చిదంబరం స్టేడియం
మే 2న – గుజరాత్ టైటాన్స్‌తో – రాత్రి 7.30 గంటలకు – నరేంద్ర మోదీ స్టేడియం
మే 5న – ఢిల్లీ క్యాపిటల్స్‌తో – రాత్రి 7.30 గంటలకు – ఉప్పల్ స్టేడియం
మే 10న – కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో – రాత్రి 7.30 గంటలకు – ఉప్పల్ స్టేడియం
మే 13న – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రాత్రి 7.30 గంటలకు – చిన్నస్వామి స్టేడియం
మే 18న – లక్నో సూపర్ జెయింట్స్ – రాత్రి 7.30 గంటలకు – ఎకానా స్టేడియం
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే..
హెన్రిచ్ క్లాసెన్, పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, రాహుల్ చాహర్, అభినవ్ మనోహర్, ఆడమ్ జంపా, సిమర్జీత్ సింగ్, ఎషాన్ మలింగ, బ్రైడాన్ కార్సే, జయదేవ్ ఉనద్కట్, కమిందు మెండిస్, జీషాన్ అన్సారీ, అనికేత్ వర్మ, అథర్వ తైడే, సచిన్ బేబీ