Cricket : నెక్ట్స్ జనరేషన్ కోసం.. శ్రీశాంత్ రిటైర్ మెంట్

నెక్స్ట్ జనరేషన్ కోసం కెరీర్ ను ముగించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు...అన్ని రకాల పోటీల నుంచి రిటైర్ అయ్యాడు. తర్వాతి తరం క్రికెటర్ల కోసం తాను ఫస్ట్ క్లాస్...

Cricket : నెక్ట్స్ జనరేషన్ కోసం.. శ్రీశాంత్ రిటైర్ మెంట్

Sreesanth (1)

Updated On : March 9, 2022 / 8:35 PM IST

S Sreesanth Retires : టీమిండియా వెటరన్ పేస్ బౌలర్ శ్రీశాంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. నెక్స్ట్ జనరేషన్ కోసం కెరీర్ ను ముగించుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని వెల్లడించారు. ఈ మేరకు 2022, మార్చి 09వ తేదీ బుధవారం ఓ ప్రకటన చేశారు. అన్ని రకాల పోటీల నుంచి రిటైర్ అయ్యాడు. తర్వాతి తరం క్రికెటర్ల కోసం తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ కెరీర్ ను ముగించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తనకు సంతోషం కలిగించే విషయం కాదని తెలిసినా.. ఈ సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ప్రతి క్షణాన్ని ఎంతో ఆదరించడం జరుగుతోందన్నారు.

Read More : India Player Sreesanth: రంజీ మ్యాచ్‌లు ఆడనున్న శ్రీశాంత్.. తొమ్మిదేళ్ల విరామం తర్వాత

టీమిండియా తరపున శ్రీశాంత్ 2011లో ఆఖరిగా అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇటీవలే రంజీ ట్రోఫీ ద్వారా పునరాగమనం చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ లో ఒక వికెట్ తీశాడు. దాదాపు 9 ఏళ్ల తర్వాత ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తొలి వికెట్ తీసిన శ్రీశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. 39 ఏళ్ల వయస్సున్న ఇతను 2005 నుంచి 2013 వరకు టీమ్ ఇండియా తరపున 53 వన్డే ఇంటర్నేషనల్స్, 10 T20Iలు ఆడాడు.

Read More : Ranji Trophy : 9 ఏండ్ల తర్వాత వికెట్ పడగొట్టాడు.. తర్వాత ఏం చేశాడంటే

అయితే..ఈ క్రమంలో ఇతనిపై తీవ్ర ఆరోపణలు రావడం అప్పట్లో సంచలనం సృష్టించాయి. 2013లో ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ తో శ్రీశాంత్ జీవితకాలం పాటు నిషేధానికి గురయ్యాడు. దీంతో అతడిపై బీసీసీఐ జీవితకాలం పాటు నిషేధం విధించింది. దీనిపై సవాల్ చేస్తూ.. న్యాయ పోరాటం చేశాడు శ్రీశాంత్. సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. శిక్ష కాలాన్ని తగ్గించాలని బీసీసీఐ ఆదేశించింది. దీంతో అతడిపై నిషేధాన్ని ఏడేళ్లకు కుదించింది. దీంతో 2020, 13 సెప్టెంబర్ నుంచి అతడిపై నిషేధం ఎత్తివేసింది. అనంతరం రంజీ ట్రోఫిలో కేరళ జట్టుకు శ్రీశాంత్ ప్రాతిధ్యం వహించాడు.