Test squad: ఇంగ్లండ్ పర్యటనలో ఈ ఇద్దరు బ్యాటర్లకు ఛాన్స్! ఎందుకంటే?
రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ పర్యటనలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉండరనే విషయం ఇప్పటికే స్పష్టమైంది.

ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టు కూర్పుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. మే 24న అధికారిక ప్రకటన రానుంది. ఈ జట్టులో కరుణ్ నాయర్, సాయి సుదర్శన్‌కు అవకాశం దక్కవచ్చని అంచనాలున్నాయి. టాప్ ఆర్డర్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ జట్టుకు సారథ్యం వహించే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇటీవల వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్.. ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్‌గా కనపడే ఛాన్స్ ఉంది. రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ పర్యటనలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఉండరనే విషయం ఇప్పటికే స్పష్టమైంది. వారిద్దరూ టెస్టు ఫార్మాట్‌కు దూరమైన వేళ వారి స్థానాలను కరుణ్ నాయర్, సాయ్ సుదర్శన్‌తో భర్తీ చేసే అవకాశం ఉంది.
దేశవాళీలో కరుణ్ నాయర్ మెరుపులు
కరుణ్ నాయర్ ఈ ఏడాది అద్భుత ఫాంలో ఉన్నాడు. రంజీ ట్రోఫీలో 9 మ్యాచ్‌ల్లో 863 పరుగులు, నాలుగు శతకాలు సాధించాడు. ఆ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో 8 మ్యాచ్‌ల్లో 779 పరుగులు, ఐదు శతకాలతో తన ఫామ్ కొనసాగించాడు.
Also Read: ఆర్సీబీకి కెప్టెన్‌గా రజత్ పటీదార్ కాకుండా జితేశ్ శర్మ ఎందుకు వచ్చాడో తెలుసా?
ఆరెంజ్ క్యాప్‌తో సత్తా చాటిన సాయి సుదర్శన్
ఐపీఎల్ 2025లో సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. అతని బ్యాటింగ్ శైలిని జాస్ బట్లర్ లాంటి ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా మెచ్చుకున్నారు. ఇతను ఇండియా-ఏ జట్టుతో పాటు, ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే రెండో మ్యాచ్ లో ఆడతాడు.
అయితే, భారత జట్టు ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ జోడీనే కొనసాగించవచ్చు. సుదర్శన్‌కు ఓపెనర్‌గా దిగే ఛాన్స్ తక్కువ. గిల్ నం.4 స్థానంలో ఆడితే, నం.3 స్థానం కోసం నాయర్, సుదర్శన్ మధ్య పోటీ ఉంటుంది.
పుజారాకు తగ్గిన అవకాశాలు?
సీనియర్ ఆటగాళ్లులేని పరిస్థితుల్లో చెతేశ్వర్ పుజారాను తీసుకుంటారని అనుకున్నప్పటికీ అతడి వయసు రీత్యా అతనికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం. జట్టులోని ఇతర కీలక ఆటగాళ్లు కూడా ఉన్నారు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లకు సులువుగా చోటు దక్కుతుంది. స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కొచ్చు. శార్దూల్ ఠాకూర్, నితీశ్ కుమార్ రెడ్డికి కూడా ఛాన్సులు ఉండవచ్చు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్ వెళ్తారు.
భారత జట్టు అంచనా
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయ్ సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్. ఈ దఫా యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు దక్కనున్నాయి.