Sai Sudharsan made his Test debut Like Ganguly and Dravid same ground and same opponent
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీకిలకు ఈ రోజు (జూన్ 20) ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈ ముగ్గురు ఆటగాళ్లు కూడా జూన్ 20వ తేదీనే అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగ్రేటం చేశారు. వీరిలో రాహుల్ ద్రవిడ్, గంగూలీలో 1996లో ఒకే మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేయగా కోహ్లీ 2011లో ఎంట్రీ ఇచ్చాడు.
1996 జూన్ 20న లండన్‌లోని లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు టెస్టుల్లో అడుగుపెట్టారు. ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బరిలోకి దిగిన గంగూలీ 131 పరుగులతో సత్తా చాటాడు. అటు ద్రవిడ్ ఏడో స్థానంలో ఆడి 95 పరుగులు చేశాడు. అయితే.. అరంగ్రేటం మ్యాచ్‌లో సెంచరీ చేసే సువర్ణావకాశాన్ని 5 పరుగుల తేడాతో ద్రవిడ్ కోల్పోయాడు.
2011 జూన్ 20న కింగ్‌స్టన్‌లోని సబీనా పార్క్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో కోహ్లీ పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 15 పరుగులు చేశాడు.
ఇక ఈ ముగ్గరు భారత జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఈ ముగ్గరు 100 కి పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడారు. అంతేకాదండోయ్ ఈ ముగ్గరు విదేశాల్లోనే టెస్టుల్లో అరంగ్రేటం చేయడం విశేషం.
Rohit Sharma : ఓ వైపు భారత్ ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతుంటే.. మరోవైపు రోహిత్ శర్మ ఎంచక్కా..
ఇక నేడు (జూన్ 20) హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో సాయి సుదర్శన్ అరంగ్రేటం చేశాడు. దీంతో పై ముగ్గురిలాగానే సాయి సుదర్శన్ కూడా గొప్ప క్రికెటర్ అవుతాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా.. గంగూలీ, ద్రవిడ్‌లాగానే సాయి సుదర్శన్ ఇంగ్లాండ్ ప్రత్యర్థిగానే అరంగ్రేటం చేయడం విశేషం.