ENG vs IND : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా? భార‌త ఆట‌గాళ్లు ఇలా ఎందుకు చేశారంటే?

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభమైంది.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో ఈ విష‌యాన్ని గ‌మ‌నించారా? భార‌త ఆట‌గాళ్లు ఇలా ఎందుకు చేశారంటే?

ENG vs IND 1st Test Team India players Wear Black Armbands

Updated On : June 20, 2025 / 4:07 PM IST

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభమైంది. హెడింగ్లీ వేదిక‌గా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ త‌ల‌ప‌డుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బ్యాటింగ్ చేస్తోంది.

అయితే.. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆట‌గాళ్లు త‌మ చేతికి న‌ల్ల‌టి బ్యాండ్‌ల‌ను ధరించి బ‌రిలోకి దిగారు. ఇలా ఆట‌గాళ్లు న‌ల్ల‌టి బ్యాండ్‌లు ధ‌రించ‌డానికి గ‌ల కార‌ణం ఏమిట‌ని కొంద‌రు సోష‌ల్ మీడియాలో వెతుకుతున్నారు.

Rohit Sharma : ఓ వైపు భార‌త్ ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్ ఆడుతుంటే.. మ‌రోవైపు రోహిత్ శ‌ర్మ‌ ఎంచ‌క్కా..

గత వారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలుపుతూ ఆట‌గాళ్లు న‌ల్ల‌టి బ్యాండ్స్‌ను ధరించారు. అంతేకాదండోయ్ ఆట ప్రారంభం కావ‌డానికి ముందు ఇరు జ‌ట్లు ఆట‌గాళ్లు ఓ రెండు నిమిషాల పాటు మౌనం కూడా పాటించారు.

టాస్ గెలిచిన త‌రువాత బెన్‌స్టోక్స్ మాట్లాడుతూ.. మొద‌ట‌గా తాము బౌలింగ్ చేస్తామ‌ని చెప్పాడు. హేడింగ్లీ అద్భుత‌మైన మైదానం అని కితాబు ఇచ్చాడు. ఇక్క‌డ చాలా మంచి క్రికెట్ ఆడామని, వాతావ‌ర‌ణ పరిస్థితులు ఉప‌యోగించుకోవాల‌నే బౌలింగ్ ఎంచుకున్న‌ట్లు తెలిపాడు.

ENG vs IND : ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు.. భార‌త కాల‌మానం ప్ర‌కారం లంచ్‌, టీ, సెష‌న్ల స‌మ‌యాలు ఇవే..

అటు భార‌త కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగే ఎంచుకోవాల‌ని అనుకున్న‌ట్లుగా చెప్పాడు. మ‌బ్బులు ప‌ట్టిన వాతావ‌ర‌ణం ఉండ‌డంతో తొలి సెష‌న్ కాస్త క‌ష్టంగా ఉండే అవ‌కాశం ఉందన్నాడు. అయితే.. ఒక్క‌సారి సూర్యుడు వ‌స్తే మాత్రం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంద‌ని చెప్పాడు. ఇక ఈ సిరీస్ కోసం చ‌క్క‌గా స‌న్న‌ద్ధం అయిన‌ట్లు వివ‌రించాడు. సాయి సుద‌ర్శ‌న్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగ్రేటం చేస్తున్నాడ‌ని, అత‌డు నంబ‌ర్ 3 స్థానంలో ఆడ‌తాడ‌ని చెప్పుకొచ్చాడు. ఇక చాలా కాలం త‌రువాత ఈ మ్యాచ్ ద్వారా క‌రుణ్ నాయ‌ర్ రీ ఎంట్రీ ఇస్తున్నాడ‌ని తెలిపాడు.

భారత తుది జ‌ట్టు..
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ

ఇంగ్లాండ్ తుదిజట్టు ఇదే..
జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌(కెప్టెన్‌), జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్సే, జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌.