ఇండియా ఓపెన్ నుంచి సైనా అందుకే తప్పుకుందా..

ఇండియా ఓపెన్ నుంచి సైనా అందుకే తప్పుకుందా..

Updated On : March 21, 2019 / 11:34 AM IST

స్విస్ ఓపెన్ టోర్నీ నుంచి తప్పుకోవడమే కాకుండా మరో గ్రాండ్ టోర్నీ నుంచి సైనా నెహ్వాల్ తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేర సైనా.. మంగళవారం నుంచి ఆరంభం కానున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ సూపర్ 500టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. మార్చి 18 సోమవారం పుట్టినరోజు జరుపుకున్న సైనాకు గ్యాస్ట్రో‌ఎంటరిటీస్ బాధ ఇంకా తగ్గలేదట.
Read Also : ఫోటోకు ఫోజులిస్తే.. ఎత్తి కుదేసిన రాకాసి అల

ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్ లోనూ ఇదే నొప్పితో బాధపడుతూ ఆడనని స్విస్ ఓపెన్ నుంచి తప్పుకుంది సైనా నెహ్వాల్. మంగళవారం నుంచి జరగనున్న ఇండియా ఓపెన్ టోర్నీకైనా అందుబాటులోకి వస్తుందా అనుకుంటే ఆ మాత్రం కూడా కోలుకోలేకపోయిందట. 

బాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తమకు అందిన సమాచారం ప్రకారం.. ఇలా ప్రకటించింది. ‘ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్ నుంచి అనారోగ్యంతో సతమతమవుతోన్న సైనా నెహ్వాల్ ఇంకా కోలుకోలేదు. కడుపునొప్పి కారణంగా తాను ఈ టోర్నీకి కూడా తప్పుకుంటున్నట్లు ఓ లెటర్ పంపింది’ అని బాయ్ తెలిపింది. 

సైనా నెహ్వాల్ ఇండియా ఓపెన్ మహిళా సింగిల్స్ విభాగంలో 2015 టైటిల్ విజేతగా నలిచింది. ఒలింపిక్ సిల్వర్ మెడల్ విజేత అయిన మాజీ చాంపియన్ పీవీ సింధు భారత్ నుంచి మహిళా విభాగంలో పోరాడుతున్న ఒక ఒక్క మహిళ. 
Read Also : జగన్‌కి ఒక్క ఛాన్స్ ఇస్తే : ప్రశాంతంగా బతకలేరు