Sania Mirza: చివరి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా.. వీడియో వైరల్

భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన చివరి గ్రాండ్‌స్లామ్‌లో ఓటమి పాలయ్యారు. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ.. నా కుమారుడు చూస్తుండగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ ఆడతానని నేనెప్పుడూ ఊహించలేదని చెప్పుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు.

Sania Mirza: చివరి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్లో ఓటమి.. కన్నీళ్లు పెట్టుకున్న సానియా మీర్జా.. వీడియో వైరల్

Sania Mirza

Updated On : January 27, 2023 / 11:45 AM IST

Sania Mirza: కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో తన క్రీడా భాగస్వామి రోహన్ బోపన్నతో కలిసి ఫైనల్స్‌లో బ్రెజిల్ జోడీ లూయిసా స్టెఫానీ, రాఫెల్ మటోవోస్‌తో తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో సోనియా- బోపన్న జోడీ తొలి దశలో అధిక్యంలో కొనసాగినప్పటికీ తర్వాత తడబడటంతో ఓటమిపాలయ్యారు. దీంతో సానియా తీవ్ర నిరాశకు లోనయ్యారు. బావోద్వేగంతో కన్నీరు ఆపుకోలేక పోయారు.

Sania Mirza Retirement: తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన సానియా మీర్జా.. ఆమె ఆడే చివరి మ్యాచ్ అదేనట..

తన సుదీర్ఘ టెన్నిస్ కెరీర్‌కు ఫిబ్రవరిలో ముగింపు పలుకుతానని సానియా ఇప్పటికే ప్రకటించారు. అయితే, సానియాకు ఇదే చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌. ఆస్ట్రేలియా ఓపెన్ -2023 గ్రాండ్‌స్లామ్‌లో సానియా, బొపన్న జోడీ ఫైనల్ వరకు వచ్చారు. ఫైనల్స్‌ పోరులో ఈ జంట 6-7, 2-6తో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. గేమ్ ముగిసిన అనంతరం రోహన్ బోపన్న సానియా తన జీవితాన్ని అద్భుతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. ఆ సమయంలో సానియా కన్నీళ్లు ఆపుకోలేకపోయింది.

 

Sania Mirza with her son ..

Sania Mirza with her son ..

సానియా మీర్జా తన ఆటతీరుతో దేశంలో ఎంతమంది యువతీయువకులను టెన్సిస్ క్రీడపై దృష్టిసారించేలా చేసింది. ఓటమి అనంతరం సానియా మాట్లాడుతూ.. అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజేతగా నిలిచిన జోడీని అభినందించారు. నా వృత్తిపరమైన కెరీర్ 2005లో మెల్ బోర్న్‌లోనే ప్రారంభమైందని తెలిపారు. గ్రాండ్ స్లామ్‌తో కెరీర్‌కు ఇక్కడే వీడ్కోలు పలికేందుకు ఇంతకంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదని సానియా అన్నారు. ఈ సమయంలో సానియా బావోద్వేగానికిలోనై  కన్నీటి పర్యాంతమయ్యారు. నా కుమారుడు చూస్తుండగా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ మ్యాచ్ ఆడతానని నేనెప్పుడూ ఊహించలేదని చెప్పుకుంటూ సానియా మరోసారి కన్నీరు పెట్టుకున్నారు.

 

ఇదిలాఉంటే సానియా మీర్జా టెన్సిస్‌లో 43 డబుల్స్ టైటిళ్లు సాధించింది. ఇందులో ఆరు గ్రాండ్ స్లామ్ ట్రోఫీలున్నాయి. మహిళల డబుల్స్ కేటగిరీలో రెండేళ్లుపాటు నెం. 1 క్రీడాకారిణిగా సానియా కొనసాగారు. కాగా, దుబాయ్ వేదికగా ఫిబ్రవరిలో జరిగే డబ్ల్యూటీఏ 1000 ఈవెంట్ తో సొనియా మీర్జా టెన్సిస్‌కు వీడ్కోలు పలకనుంది.