Sania Mirza Retirement: తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన సానియా మీర్జా.. ఆమె ఆడే చివరి మ్యాచ్ అదేనట..

భారత టెన్నిస్ స్టార్  సానియామీర్జా గత సంవత్సరం యూఎస్ ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని భావించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనసైతం విడుదల చేసింది. అయితే, గాయం కారణంగా ఆమె ఆ టోర్నమెంట్‌లో ఆడలేకపోయింది. దీంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. తాజాగా వచ్చే నెలలో దుబాయ్‌లో ఆమె చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ద్వారా ఆమె తన ప్రొఫెషనల్ కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టనుంది. 

Sania Mirza Retirement: తన రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన సానియా మీర్జా.. ఆమె ఆడే చివరి మ్యాచ్ అదేనట..

Saniya mirza

Sania Mirza Retirement: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా.. టెన్నిస్ గురించి పరిచయమున్న ప్రతిఒక్కరికి ఆమె పేరు సుపరిచితమే. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. తన కెరీర్‌లో మూడు సార్లు డబుల్స్, మూడు సార్లు మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె త్వరలో రిటైర్మెంట్ కాబోతుంది. ఈ విషయంపై సానియా క్లారిటీ ఇచ్చింది. ఫిబ్రవరిలో తన రిటైర్మెంట్ ఉంటుందని చెప్పింది. దుబాయ్ వేదికగా జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీలో తాను కెరీర్‌ను ముగించనున్నట్లు సానియా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేసింది.

Sania Mirza: సానియా మీర్జాతో విడాకులు.. స్పందించిన షోయబ్ మాలిక్.. ఏం చెప్పాడంటే

36ఏళ్ల సానియా మీర్జా ఆస్ట్రేలియా ఓపెన్ ఆడనుంది. కజకిస్థాన్ క్రీడాకారిణి అనా డనిలినాతో కలిసి ఆమె మహిళల డబుల్స్ లో పోటీ పడనుంది. ఇదే ఆమెకు చివరి గ్రాండ్ స్లామ్ కానుంది. ఈ టోర్నీ పూర్తయ్యాక దుబాయ్‌లో ఆమె తన చివరి మ్యాచ్ ఆడనుంది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ తర్వాత ఆమె ప్రొఫెసనల్ టెన్నిస్‌కు గుడ్ బై చెప్పనుంది.

 

భారత టెన్నిస్ స్టార్  సానియామీర్జా గత సంవత్సరం యూఎస్ ఓపెన్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు వీడ్కోలు పలకాలని భావించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటనసైతం చేసింది. అయితే, గాయం కారణంగా ఆమె ఆ టోర్నమెంట్‌లో ఆడలేకపోయింది. దీంతో తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. తాజాగా వచ్చే నెలలో దుబాయ్‌లో ఆమె చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ద్వారా ఆమె తన ప్రొఫెషనల్ కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టనుంది.  సానియా మీర్జా గత పది సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తుంది. దుబాయ్‌లో సానియా మీర్జాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. దీంతో ఆమె దుబాయ్ వేదికగా అభిమానుల మధ్య టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమైంది.