Sanju Samson : సంజు శాంసన్ విధ్వంసం.. సెంచరీతో శుభ్‌మన్ గిల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్.. ఆ ప్లేస్ నాదే..!

Sanju Samson : సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ -2025లో కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఆదివారం ఏరీస్ కొల్లం సెయిలర్స్ తో జరిగిన మ్యాచ్ లో

Sanju Samson

Sanju Samson : ఆసియా కప్ -2025 టోర్నీ వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీకోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. దీంతో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా బరిలోకి దిగనుంది. అయితే, భారత జట్టు ప్రకటన తరువాత ఆసియా కప్‌లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుందనే అంశంపై చాలా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓపెనర్లుగా క్రీజులోకి ఎవరు వస్తారనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్ (Sanju Samson) మధ్య పోటీ నెలకొంది. ఈ తరుణంలో సెంచరీతో చెలరేగిపోయిన సంజూ శాంసన్.. గిల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు.

Also Read: Cheteshwar Pujara Retirement : క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఛెతేశ్వర్ పుజారా.. ‘ఎక్స్’లో భావోద్వేగ పోస్టు

సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ -2025లో కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు. ఆదివారం ఏరీస్ కొల్లం సెయిలర్స్ తో జరిగిన మ్యాచ్ లో కొచ్చి బ్లూ టైగర్స్ తరపున బరిలోకి దిగిన సంజూ.. బ్యాటుతో విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన అతను మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ ఫోర్లు, సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. తద్వారా కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు.

 

బౌండరీల మోత..

సంజూ శాంసన్ తన ఇన్నింగ్స్‌లో తొలి 16 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ చేశాడు. ఆ తరువాత 26బంతుల్లోనే మరో ఆఫ్ సెంచరీ చేశాడు. దీంతో 42 బంతుల్లోనే 13ఫోర్లు, ఐదు భారీ సిక్సులతో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తం తన ఇన్నింగ్స్‌లో 51 బంతులను ఎదుర్కొన్న సంజూ.. 121 పరుగులు చేశాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో సెలక్టర్ల దృష్టిని మరోసారి సంజూ శాంసన్ తనవైపు తిప్పుకున్నాడు. తద్వారా ఆసియా కప్ లో ఓపెనింగ్ స్థానం నాదే అంటూ గిల్ కు వార్నింగ్ ఇచ్చాడు.


ఆసియా కప్ టోర్నీలో వైస్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. గిల్ ఎంట్రీతో సంజూ శాంసన్ ఓపెనింగ్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది. ఆయన్ను మిడిలార్డర్‌కు పరిమితం చేయొచ్చునని లేదా పూర్తిగా పక్కన పెట్టొచ్చని వార్తలు వస్తున్నాయి. ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలు క్రీజులోకి వస్తారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో కేరళ క్రికెట్ లీగ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన సంజూ.. తుపాను ఇన్నింగ్స్‌తో కేవలం 42 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించడంతో పాటు.. ఆసియా కప్‌లో ఓపెనింగ్ స్థానం నాదే అంటూ గర్జించాడు.

ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్..

తిరువనంతపురంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కొల్లం సెల్లర్స్, కొచ్చి బ్లూ టైగర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కొల్లం సెల్లర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 236 పరుగులు చేశారు. భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు.. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో విజయం సాధించింది. సంజూ శాంసన్ తుఫాన్ ఇన్నింగ్స్ కారణంగా భారీ లక్ష్యాన్ని కొచ్చి బ్లూ టైగర్స్ చేధించి విజయాన్ని దక్కించుకుంది.