MS Dhoni
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023లో భాగంగా బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals )తో జరిగిన మ్యాచ్‌లో 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings ) విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని 9 బంతుల్లో 1 పోర్లు, 2 సిక్స్‌లతో 20 పరుగులు చేసి చేశాడు. భారీ షాట్లు అయితే అలవోకగా కొట్టిన ధోని వికెట్ల మధ్య మాత్రం చురుకుగా పరిగెత్త లేదు. రెండు పరుగులు తీసే చోట కూడా ఒక్క పరుగుకే పరిమితం అయ్యాడు. ఇలా ధోని వికెట్ల మధ్య తడబడుతూ పెరిగెడుతుండడాన్ని చూసి తాను భావోద్వేగానికి లోనైనట్లు ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు.
అంబటి రాయుడు ఔట్ కాగానే ధోని మైదానంలోకి వచ్చాడు. ధోని క్రీజులోకి రావడంతో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మారు మోగిపోయింది. ధోని తనదైన శైలిలో ఫినిషింగ్ ఇచ్చాడు. సాధారణంగా ఒక్క పరుగు వచ్చే చోట రెండు పరుగులు తీసే ధోని.. ఢిల్లీతో మ్యాచ్‌లో మాత్రం రెండు పరుగులు ఈజీగా వచ్చే అవకాశం ఉన్నా ఒక్క పరుగే పరిమితం అయ్యాడు. ఇదే విషయం చాలా మందికి అర్థం కాలేదు.
IPL 2023, CSK vs DC: చెపాక్‌లో చెలరేగిన ధోని సేన.. ఢిల్లీపై ఘన విజయం
41 ఏళ్ల ధోని ఈ సీజన్‌లో 204.25 స్ట్రైక్ రేట్‌తో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 96 పరుగులు చేశాడు. ఇందులో సింగిల్, డబుల్స్ ద్వారా కేవలం 24 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వికెట్ల మధ్య పరిగెత్తేందుకు మహేంద్రుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఎందుకంటే ఈ సీజన్ ప్రారంభం నుంచి కెప్టెన్ కూల్ ఎడమ మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్నట్లు చెన్నై జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఇప్పటికే వెల్లడించాడు. నిన్నటి మ్యాచ్‌లో సైతం మోకాలికి పట్టీ కట్టుకునే ధోని బ్యాటింగ్ చేశాడు.
మ్యాచ్ అనంతరం పఠాన్ ఇలా అన్నాడు.. ‘ఎప్పుడూ ధోనిని వికెట్ల మధ్య చిరుతలా పరిగెత్తడం చూశాను. అయితే నిన్నటి మ్యాచ్‌లో మహేంద్రుడి పరుగు చూసి నా గుండె పలిగిపోయింది.’ అని పఠాన్ ట్వీట్ చేశాడు.
Seeing Dhoni limping thru running between the wickets breaks my heart. Have seen him run like a cheetah.
— Irfan Pathan (@IrfanPathan) May 10, 2023
ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకు 12 మ్యాచులు ఆడింది. ఏడు మ్యాచుల్లో విజయం సాధించగా 4 మ్యాచ్‌లో ఓడిపోయింది. వర్షం కారణంగా ఓ మ్యాచ్ రద్దు కావడంతో 15 పాయింట్లలో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంకో రెండు మ్యాచ్‌లు చెన్నై ఆడనుండగా కనీసం ఒక్క దాంట్లో విజయం సాధించినా ఎలాంటి సమీకరణాలు లేకుండా చెన్నై ప్లే ఆఫ్స్‌కు చేరడం ఖాయం.
MS Dhoni: అసలు నిజాన్ని చెప్పిన చెన్నై కోచ్.. మోకాలి గాయంతోనే మ్యాచ్ ఆడిన ధోని