Shakib al Hasan : భార‌త్‌తో రెండో టెస్టు.. ష‌కీబ్ అల్ హ‌స‌న్ సంచ‌ల‌న‌ నిర్ణ‌యం.. టెస్టులు, వ‌న్డేలు, టీ20ల‌కు రిటైర్‌మెంట్

బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

Shakib al Hasan retirement

Shakib al Hasan retirement : కాన్ఫూర్ వేదిక‌గా శుక్ర‌వారం భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ క్ర‌మంలో గురువారం బంగ్లాదేశ్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. టీ20లకు, టెస్టుల‌కు అలాగే వ‌న్డేల‌కు సైతం వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. టీ20ల్లో త‌న రిటైర్‌మైంట్ నిర్ణ‌యం త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌న్నాడు. ఇక టెస్టుల్లో మాత్రం సొంత‌గ‌డ్డ పై సౌతాఫ్రికాతో చివ‌రి మ్యాచ్ ఆడ‌నున్న‌ట్లు చెప్పాడు.

షెడ్యూల్ ప్ర‌కారం బంగ్లాదేశ్‌, ద‌క్షిణాఫ్రికా జ‌ట్లు అక్టోబ‌ర్‌లో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఇందులో మీర్పూర్ వేదిక‌గా జ‌రిగే మ్యాచ్ సుదీర్ఘ ఫార్మాట్‌లో ఆఖ‌రి కానుంద‌ని వెల్ల‌డించాడు.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు.. అశ్విన్‌ను ఊరిస్తున్న 6 రికార్డులు.. ఏంటో తెలుసా?

‘మిర్పూర్‌లో నా చివరి టెస్టు ఆడాలనే కోరికను బీసీబీకి తెలియజేశాను. వారు నాతో అంగీకరించారు. నేను బంగ్లాదేశ్‌కు వెళ్లేందుకు వీలుగా అన్నీ ఏర్పాట్లు చేస్తామ‌ని అన్నారు. అయితే.. భద్రతాపరమైన ఆందోళనలు ఈ చర్యకు ఆటంకం కలిగిస్తే, కాన్పూర్‌లో భారత్‌తో జరగబోయే రెండో టెస్టు మ్యాచే నా కెరీర్‌లో ఆఖ‌రిది.’ అని అన్నాడు. ఇక వ‌న్డేల్లో మాత్రం వ‌చ్చే ఏడాది పాకిస్థాన్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025 త‌న‌కు చివ‌రిది అని ష‌కీబ్‌ అన్నాడు.

షేక్ హ‌సీనా ప్ర‌భుత్వంలో ష‌కీబ్ ఎంపీగా ఉన్నాడు. అయితే.. తిరుగుబాటు కార‌ణంగా షేక్ హ‌సీనా దేశం విడిచి పారిపోయారు. ఆమె ప్ర‌భుత్వం ర‌ద్దైంది. అప్ప‌టి నుంచి ష‌కీబ్ బంగ్లాదేశ్‌కు వెళ్ల‌లేదు. ఓ హ‌త్య కేసులో అభియోగాలు మోప‌బ‌డిన 147 నిందితుల్లో ష‌కీబ్ పేరు కూడా ఉంది. ఈ క్ర‌మంలో అత‌డు బంగ్లాదేశ్‌కు వెలుతాడా? లేదా అన్న దానిపై స‌ర్వ‌త్రా ఉద్రిక్త‌త నెల‌కొంది.

IND vs BAN : బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు ముందు టీమ్ఇండియా అభిమానుల‌కు బ్యాడ్‌న్యూస్‌..

2006లో అంతర్జాతీయ క్రికెట్‌లో ష‌కీబ్ అరంగేట్రం చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు 69 టెస్టులు, 247 వ‌న్డేలు, 129 టీ20 మ్యాచులు ఆడాడు. 69 టెస్టుల్లో 4543 ప‌రుగుల‌తో పాటు 242 వికెట్లు తీశాడు. 247 వ‌న్డేల్లో 7570 ప‌రుగుల‌తో పాటు 317 వికెట్లు పడ‌గొట్టాడు. ఇక 129 టీ20 మ్యాచుల్లో 793 ప‌రుగుల‌తో పాటు 149 వికెట్లు సాధించాడు.