Shakib Al Hasan : భార్యను మోసం చేసిన స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్..! నిజాలు బయట పెట్టిన అతడి సతీమణి
క్రికెట్ అభిమానులకు బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
Shakib Al Hasan wife : క్రికెట్ అభిమానులకు బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. క్రికెట్‌లో అప్పుడప్పుడు అతడు చేసే పనుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అతడు తన భార్యను మోసం చేసినట్లుగా కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ వార్తలపై షకీబ్ భార్య ఉమ్మీ అహ్మద్ శిశిర్ స్పందించింది. ఈ వార్తలను ఆమె ఖండించింది. ఓ భర్తగా, తండ్రిగా షకీబ్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు అని తెలిపింది.
కొద్ది రోజుల క్రితం షకీబ్ భార్య శిశిర్ తన సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను డిలీట్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనే ప్రచారం జరిగింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. ఆ ఫోటోలను డిలీట్ చేయలేదని, వాటిని ప్రైవేటులో పెట్టినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది.
Duleep Trophy 2024 : దులీప్ ట్రోఫీని ఫ్రీగా ఎలా చూడొచ్చొ తెలుసా..?
ఓ క్రికెటర్‌గా అతడి ఆటపై ఎవరికి ఎన్ని అభిప్రాయాలు అయినా ఉండొచ్చునని అంది. వాటిని గురించి తాను మాట్లాడనుంది. ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని తెలిపింది. ఆట పరంగా అతడి పై ఎన్ని విమర్శలు అయినా చేయొచ్చునని, అయితే.. వ్యక్తిగత జీవితంతో మాత్రం ముడిపెట్టవద్దని కోరింది. షకీబ్ గొప్ప భర్త, తండ్రి అని తనతో ఎంతో నిజాయితీగా ఉంటాడంది. ఇప్పటి వరకు తనను ఎప్పుడు బాధపెట్టలేదంది.
పెళ్లై 13 సంవత్సరాలు అయిందని, అప్పట్లో ఎలాగా ఉండేవాళ్లమో ఇప్పుడూ అలాగే ఉంటున్నట్లుగా చెప్పింది. జీవిత భాగస్వామిగా తన భర్తకి 100 కి 100 మార్కులు వేస్తానంది. మాది ఓ అందమైన కుటుంబం. దయచేసి సోషల్ మీడియాలో రూమర్లను ఆపండి అని అంది. ఇలా ప్రచారం చేస్తున్న వారికి దీని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం తనకు ఇష్టం ఉండదంది.
BCCI : అబ్బే మా వల్ల కాదు.. ఐసీసీకి తేల్చిచెప్పిన బీసీసీఐ.. ఇప్పుడెలా మరీ..?
గత కొన్ని రోజులుగా కాల్స్, మెసేజ్‌లు విపరీతంగా వస్తున్నాయి. దీంతో అవన్నీ తప్పుడు వార్తలని చెప్పేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలిపింది. షకీబ్ ఇప్పుడు పాకిస్తాన్ సిరీస్ పై ఫోకస్ చేశాడని, తాను తన కుటుంబంపై దృష్టిసారించనున్నట్లు చెప్పింది. తాను ఎలాంటి పోస్టులు, ఫోటోలను తొలగించలేదని, ప్రైవేటులో ఉంచినట్లుగా శిశిర్ తెలిపింది.
ఇదిలా ఉంటే.. షకీబ్ ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు. పాకిస్తాన్‌తో ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ కోసం జట్టుతో కలిసి సన్నద్దం అవుతున్నాడు.