IND vs ENG : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. చ‌రిత్ర సృష్టించేందుకు 25 ప‌రుగుల దూరంలో శుభ్‌మ‌న్ గిల్‌..

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మాంచెస్ట‌ర్ వేదికగా జూలై 23 నుంచి 27 వ‌ర‌కు నాలుగో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Shubman Gill

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య మాంచెస్ట‌ర్ వేదికగా జూలై 23 నుంచి 27 వ‌ర‌కు నాలుగో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే సిరీస్‌లో 1-2తో వెనుక‌బ‌డి ఉన్న భార‌త్.. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి సిరీస్‌ను స‌మం చేయాల‌ని భావిస్తోంది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మాంచెస్ట‌ర్ చేరుకున్న భార‌త బృందం నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తోంది. కాగా.. ఈ కీల‌క మ్యాచ్‌కు ముందు టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది.

Rishabh Pant : చ‌రిత్ర సృష్టించేందుకు సిద్ధం అవుతున్న రిష‌బ్ పంత్.. భారీ రికార్డు పై క‌న్ను..

ఈ మ్యాచ్‌లో గిల్ 25 ప‌రుగులు చేస్తే.. ఇంగ్లాండ్ గ‌డ్డ పై ఓ ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆసియా బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు పాకిస్తాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ యూసుఫ్ పేరిట ఉంది.

యూస‌ఫ్ 2006లో ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌రిగిన నాలుగు టెస్టుల్లో 90.14 స‌గ‌టుతో 631 ప‌రుగులు సాధించాడు. ప్రస్తుత సిరీస్‌లో గిల్ ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడాడు. 101.16 సగటుతో 607 పరుగులు చేశాడు.

Karun Nair : ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టు.. గుడ్ బై చెప్పేసిన క‌రుణ్ నాయ‌ర్‌..

ఇంగ్లాండ్ గ‌డ్డ‌పై టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లు..

* మహ్మద్ యూసుఫ్ (పాకిస్తాన్) – 4 మ్యాచ్‌ల్లో 631 పరుగులు (2006లో)
* శుభ్‌మన్ గిల్ (భారత్‌) – 3 మ్యాచ్‌ల నుండి 607 పరుగులు (2025లో)
* రాహుల్ ద్రవిడ్ (భారత్‌) – 4 మ్యాచ్‌ల నుండి 602 పరుగులు (2002లో)
* విరాట్ కోహ్లీ (భారత్‌) – 5 మ్యాచ్‌ల నుండి 593 పరుగులు (2018లో)
* సునీల్ గవాస్కర్ (భారత్‌) – 4 మ్యాచ్‌ల నుండి 542 పరుగులు (1979లో)
* సలీమ్ మాలిక్ (పాకిస్తాన్‌) – 5 మ్యాచ్‌ల నుండి 488 పరుగులు (1992లో)