Shubman Gill hits the nets right after Bengaluru Test defeat
న్యూజిలాండ్‌తో బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. కాగా.. మ్యాచ్ ముగిసిన అనంతరం చిన్నస్వామి స్టేడియంలో శుభ్‌మన్ గిల్ తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వాస్తవానికి బెంగళూరు మ్యాచ్‌లో గిల్ ఆడాల్సి ఉంది. అయితే.. తొలి టెస్టు ప్రారంభానికి ముందు గిల్ మెడనొప్పితో బాధపడ్డాడు. దీంతో అతడిని చివరి నిమిషంలో జట్టు నుంచి తప్పించారు. అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్‌ను అవకాశం ఇచ్చారు. తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ డకౌట్ అయినప్పటికి రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులతో సత్తా చాటాడు.
గిల్ ఆరోగ్య పరిస్థితిపై మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడాడు. గిల్ బాగానే ఉన్నట్లు చెప్పాడు. దీంతో అతడు రెండో టెస్టుకు అందులోబాటులోకి వచ్చినట్లే. గిల్ అందుబాటులో రావడంతో రెండో టెస్టు మ్యాచ్‌లో ఎవరిని తప్పిస్తారు అనే ప్రశ్న మొదలైంది. ఫామ్‌లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ లేదా కేఎల్ రాహుల్‌లలో ఒకరి తప్పించే ఛాన్స్ ఉన్నట్లు క్రీడావర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
అక్టోబరు 24 నుంచి పూణె వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్లు రెండో టెస్టు మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఆ విషయంలో మేము విఫలమయ్యాం.. అందుకే ఓడిపోయాం : రోహిత్ శర్మ
Shubman Gill is working hard in nets after the end of the first Test. 🇮🇳 pic.twitter.com/fVQ7p4jUT2
— Johns. (@CricCrazyJohns) October 20, 2024
With a heavily strapped left knee, #MohammedShami bowls to #ShubmanGill at the M Chinnaswamy Stadium. #BCCI @DeccanHerald pic.twitter.com/itpxNRrcl1
— Madhu Jawali (@MadhuJawali) October 20, 2024