Shubman Gill in the list of Bradman and Gavaskar
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 228 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. గిల్ టెస్టు కెరీర్‌లో అతడికి ఇది తొమ్మిదో సెంచరీ. ఈ క్రమంలో పలు రికార్డులను అందుకున్నాడు.
ఇంగ్లాండ్ గడ్డ పై గిల్‌కు ఇది నాలుగో సెంచరీ. అది కూడా ఈ సిరీస్‌లోనే కావడం విశేషం. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డ పై ఒకే టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన టీమ్ఇండియా ఆటగాడిగా గిల్ చరిత్ర సృష్టించాడు. ఇక ఓవరాల్‌గా ఒకే టెస్టు సిరీస్‌లో నాలుగు శతకాలు బాదిన మూడో భారత ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఇంగ్లాండ్ గడ్డపై ఒకే ఒక ఆసియా క్రికెటర్..
ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
సునీల్ గవాస్కర్ – 4 శతకాలు (1971లో విండీస్ పై) (Away)
సునీల్ గవాస్కర్ – 4 శతకాలు (1978/79లో విండీస్ పై) (Home)
విరాట్ కోహ్లీ – 4 శతకాలు (2014/15లో ఆస్ట్రేలియాపై) (Away)
శుభ్‌మన్ గిల్ – 4* సెంచరీలు (2025లో ఇంగ్లాండ్ పై) (Home)
అదే విధంగా కెప్టెన్‌గా ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో గిల్.. దిగ్గజ ఆటగాళ్లు డాన్ బ్రాడ్‌మాన్, సునీల్ గవాస్కర్‌ల సరసన నిలిచాడు.
VVS Laxman-Gautam Gambhir : గంభీర్ స్థానంలో టీమ్ఇండియా టెస్టు జట్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ?
Shubman Gill in the list of Bradman and Gavaskar. 🔥 pic.twitter.com/Yg8PXmfcix
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2025
ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్లు వీరే..
* డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) – 4 శతకాలు (1947/48లో భారత్‌పై )
* సునీల్ గవాస్కర్ (భారత్) – 4 శతకాలు (1978/79లో విండీస్ పై)
* శుభ్‌మన్ గిల్ (భారత్) – 4 శతకాలు (2025లో ఇంగ్లాండ్ పై)