Shubman Gill : చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్.. ఇంగ్లాండ్ గడ్డపై ఒకే ఒక ఆసియా క్రికెటర్..
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు.

Shubman Gill becomes first cricketer from asia to score 700 runs in a test series
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ గడ్డ పై 700కి పైగా పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. అంతేకాదండోయ్.. ఓ టెస్టు సిరీస్‌లో 700కి పైగా పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు.
ఇంగ్లాండ్ గడ్డ పై ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆసియా బ్యాటర్లు వీరే..
శుభ్‌మన్ గిల్ (భారత్) – 701* పరుగులు
మహ్మద్ యూసఫ్ (పాకిస్థాన్) – 631 పరుగులు
రాహుల్ ద్రవిడ్ (భారత్) – 602 పరుగులు
విరాట్ కోహ్లీ (భారత్) – 593 పరుగులు
VVS Laxman-Gautam Gambhir : గంభీర్ స్థానంలో టీమ్ఇండియా టెస్టు జట్టు కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ ?
🚨 SHUBMAN GILL BECOMES THE FIRST ASIAN BATTER TO COMPLETE 700 RUNS IN A SERIES IN ENGLAND 🚨
– Captain on a Roll, What a Batter. 🇮🇳 pic.twitter.com/l8oom6es0R
— Johns. (@CricCrazyJohns) July 27, 2025
టీమ్ఇండియా తరుపున ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. ఆ తరువాతి స్థానంలో యశస్వి జైస్వాల్ ఉండగా, గిల్ మూడో స్థానానికి చేరుకున్నాడు.
ENG vs IND : శుభ్‌మన్ గిల్- కేఎల్ రాహుల్ అద్భుత రికార్డు.. గత 54 ఏళ్లలో ఇదే తొలిసారి..
ఓ టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
సునీల్ గవాస్కర్ – 4 టెస్టుల్లో 774 పరుగులు (1970/71 సీజన్‌లో వెస్టిండీస్‌పై)
సునీల్ గవాస్కర్ – 6 మ్యాచ్‌ల్లో 732 పరుగులు (1978/79లో వెస్టిండీస్ పై)
యశస్వి జైస్వాల్ – 5 మ్యాచ్‌ల్లో 712 పరుగులు (2024లో ఇంగ్లాండ్ పై)
శుభ్‌మన్ గిల్ – 4 మ్యాచ్‌ల్లో 700 * పరుగులు (2025లో ఇంగ్లాండ్ పై)