Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా ఏడు మ్యాచ్‌ల్లో గెలుపొందింది. మరో మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 14 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉండగా నెట్‌రన్‌రేట్ +0.867గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ గిల్ జట్టు విజయాల్లో తన పాత్రను అద్భుతంగా పోషిస్తున్నాడు. ఒత్తిడిని ఎదుర్కొంటూ జట్టును సమర్థవంతంగా ముందుకు నడిస్తున్నాడు. ఈ విషయమై గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి స్పందించారు. గిల్ పై ప్రశంసల వర్షం కురిపించారు.
Virat Kohli : ఆర్‌సీబీ కెప్టెన్సీని వదిలివేయడం పై విరాట్ కోహ్లీ కామెంట్స్.. కష్టంగా అనిపించింది
ఓ వైపు నాయకత్వ భారాన్ని మోస్తూ రాణిస్తున్న క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్ ఒకడు అని అన్నాడు. అతడు ప్రస్తుతం ఎంతో పరిణితి సాధించినట్లు తెలిపాడు. గిల్ ప్రతిభావంతమైన బ్యాటర్ అని అతడు నాయకత్వం చేపట్టిన సమయంలో ఒత్తిడి వల్ల అతడి ఆటతీరు దెబ్బతింటుదనే సందేహాలు క్రీడాభిమానుల్లో వచ్చాయన్నారు. అయితే.. అలాంటిది ఏమీ జరగలేదన్నాడు. ఆటగాడిగా రాణించడంతో పాటు కెప్టెన్సీలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.
గత మూడు సీజన్లుగా గిల్ నిలకడగా రాణిస్తూ వస్తున్నాడు. 2023 సీజన్‌లో 890 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. ఆ తరువాత ఐపీఎల్ 2024 సీజన్‌లో 12 మ్యాచ్‌ల్లో 426 పరుగులు చేశాడు. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌ల్లో 162 స్ట్రైక్‌రేటుతో 465 పరుగులు చేశాడు.