Rohit Sharma-Mohammed Siraj : గుజ‌రాత్‌తో మ్యాచ్‌కు ముందు సిరాజ్‌ను కూల్ చేసిన రోహిత్ శ‌ర్మ‌.. అదిరిపోయే గిఫ్ట్‌..

టీమ్ఇండియా 2024లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Rohit Sharma-Mohammed Siraj : గుజ‌రాత్‌తో మ్యాచ్‌కు ముందు సిరాజ్‌ను కూల్ చేసిన రోహిత్ శ‌ర్మ‌.. అదిరిపోయే గిఫ్ట్‌..

Rohit presents Siraj with special T20 World Cup ring ahead of MI vs GT clash

Updated On : May 6, 2025 / 11:56 AM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా మంగ‌ళ‌వారం వాంఖ‌డే వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో ముంబై ఇండియ‌న్స్ త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ రోహిత్ శ‌ర్మ చేసిన ప‌నికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అత‌డు గుజ‌రాత్ స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్‌ సిరాజ్ కు వ‌జ్ర‌పు ఉంగ‌రాన్ని అందజేశాడు.

టీమ్ఇండియా 2024లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆట‌గాళ్ల‌కు బీసీసీఐ వ‌జ్ర‌పు ఉంగ‌రాన్ని బ‌హుమ‌తిగా ప్ర‌క‌టించింది. బీసీసీఐ న‌వ‌న్ అవార్డు ప్ర‌ధానోత్స‌వంలో ఆట‌గాళ్ల‌కు ఈ వ‌జ్ర‌పు ఉంగ‌రాల‌ను అంద‌జేసింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో సిరాజ్ సైతం ఉన్నాడు. కానీ అత‌డు ఆ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాలేదు.

SRH : ప్లేఆఫ్స్ నుంచి స‌న్‌రైజ‌ర్స్ ఔట్‌.. త‌ప్పు ఎక్క‌డ జ‌రిగిందంటే.. కోచ్ డానియర్ వెటోరి కామెంట్స్ వైర‌ల్‌..

ఈక్ర‌మంలోనే తాజాగా రోహిత్ శ‌ర్మ స్వ‌యంగా వ‌చ్చి సిరాజ్‌కు ఉంగ‌రాన్ని అంద‌జేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వజ్రపు ఉంగరంలో 60 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ఉంటుంది. ఆటగాడి పేరు, జెర్సీ నంబర్ రింగ్‌పై రాసి ఉంటుంది. భార‌త జ‌ట్టు ఏ మ్యాచ్‌లో ఎన్ని ప‌రుగులు లేదా ఎన్ని వికెట్లు, ఏ ప్ర‌త్య‌ర్థి అన్న వివ‌రాలు రాసి ఉంటాయి.

ఇక ముంబై, గుజ‌రాత్ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి ప్లేఆఫ్స్‌కు మ‌రింత చేరువ‌కావాల‌ని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇది ​​రెండో మ్యాచ్. గత మ్యాచ్‌లో గుజరాత్.. ముంబైని 36 పరుగుల తేడాతో ఓడించింది.

RCB : ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా.. ఇలా జరిగితే ఐపీఎల్ 2025 నుంచి ఆర్‌సీబీ ఔట్‌?

ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో ముంబై మూడో స్థానంలో ఉండ‌గా, నాలుగో స్థానంలో గుజ‌రాత్ ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జ‌ట్టు టాప్‌-2కి చేరుకుంటుంది.