SRH : ప్లేఆఫ్స్ నుంచి సన్‌రైజర్స్ ఔట్.. తప్పు ఎక్కడ జరిగిందంటే.. కోచ్ డానియర్ వెటోరి కామెంట్స్ వైరల్..
ఢిల్లీతో మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కోచ్ డానియల్ వెటోరి మీడియాతో మాట్లాడాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ కథ ముగిసింది. సోమవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో సన్‌రైజర్స్ అధికారికంగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్ర్కమించింది.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత దాదాపు గంట సేపు వర్షం కురవడంతో మైదానంలోని ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరు జట్లకు ఒక్కొ పాయింట్‌ను కేటాయించారు.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ 11 మ్యాచ్‌లు ఆడింది. కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీతో మ్యాచ్ రద్దైన తరువాత సన్‌రైజర్స్ కోచ్ డానియల్ వెటోరి మీడియాతో మాట్లాడాడు.
ఈ సీజన్‌లో పరిస్థితులు తాము ఊహించిన విధంగా లేవన్నాడు. ప్రతి మ్యాచ్‌లో తాము దూకుడుగా ఆడాలని అనుకోలేదన్నాడు. గతేడాది ఉప్పల్ మైదానంలో హైస్కోరింగ్ మ్యాచ్ లు చూశామని, అయితే ఈ సారి పిచ్ లు కాస్త భిన్నంగా స్పందిచాయని తెలిపాడు. పిచ్‌లు బ్యాటింగ్‌కు అంతగా అనుకూలించలేదన్నాడు. ఉప్పల్ మైదానంలో ఆరు పిచ్‌లు ఉండగా.. అందులో రెండు పిచ్‌లు 250 ఫ్లస్ స్కోర్లకు అనుకూలంగా ఉంటే నాలుగు మాత్రం పేసర్లకు అనుకూలించినట్లుగా చెప్పాడు.
ఇక స్పిన్‌కు ఏమాత్రం సహకారం లేదన్నాడు. బంతి బ్యాట్ మీదకు రాలేదని, కొత్త బంతిని బాదడంలో ఆటగాళ్లు ఇబ్బంది ఎదుర్కొన్నారని తెలిపాడు.
‘ఇక ఢిల్లీతో మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ కేవలం మూడు మ్యాచ్‌ల్లోనే గెలిచింది. దీంతో ఢిల్లీతో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఢిల్లీని 133 పరుగులకే కట్టడి చేశారు. అయితే.. వరుణుడు మా ఆశలపై నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది. మొత్తంగా ఈ సీజన్‌లో మాకు ఏదీ కలిసి రాలేదు.’ అని వెటోరి అన్నాడు.
RCB : ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా.. ఇలా జరిగితే ఐపీఎల్ 2025 నుంచి ఆర్‌సీబీ ఔట్?
ఇక పేసర్ షమీ గురించి మాట్లాడుతూ.. అతడికి ఈ సీజన్ ఎంతో కఠినమైనది అని చెప్పుకొచ్చాడు. అయినప్పటికి అతడు తన అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకే ప్రయత్నం చేశాడని తెలిపాడు. ఇక మొత్తంగా ఆటగాళ్లలో ప్రదర్శనలో నిలకడ లోపించిందని వెటోరి చెప్పాడు.