Virat Kohli : ఆర్‌సీబీ కెప్టెన్సీని వ‌దిలివేయ‌డం పై విరాట్ కోహ్లీ కామెంట్స్‌.. క‌ష్టంగా అనిపించింది

ఆర్‌సీబీ కెప్టెన్సీని విడిచిపెట్ట‌డానికి గ‌ల కార‌ణాన్ని విరాట్ కోహ్లీ వెల్ల‌డించాడు.

Virat Kohli : ఆర్‌సీబీ కెప్టెన్సీని వ‌దిలివేయ‌డం పై విరాట్ కోహ్లీ కామెంట్స్‌.. క‌ష్టంగా అనిపించింది

Virat Kohli reveals why he took the decision to leave RCB captaincy during IPL 2021

Updated On : May 6, 2025 / 12:53 PM IST

ఐపీఎల్ ఆరంభం నుంచి రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకే ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ. ఆర్‌సీబీకి కొన్నాళ్ల పాటు నాయ‌క‌త్వం వ‌హించాడు. అయితే.. స‌డెన్‌గా 2021 సీజ‌న్ త‌రువాత‌ అత‌డు కెప్టెన్సీకి వీడ్కోలు ప‌లికాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో తాను బెంగ‌ళూరు జ‌ట్టు సార‌థ్య బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వెల్ల‌డించాడు.

‘నేను నా కెరీర్‌లో 7 నుంచి 8 ఏళ్ల పాటు టీమ్ఇండియాకు, తొమ్మిదేళ్ల పాటు ఆర్‌సీబీకి కెప్టెన్‌గా ఉన్నాను. అప్పుడు నా మీద చాలా అంచనాలు ఉండేవి. ప్ర‌తి మ్యాచ్‌లో త‌ప్ప‌క రాణించాల‌నే ప్రెజ‌ర్ ఉండేది. బ్యాట‌ర్‌గా స‌క్సెస్ అవ్వ‌డంతో సార‌థిగా అంచ‌నాలు పెరిగిపోయేవి. బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్సీలో స‌క్సెస్ అవ్వాల‌నే అంచ‌నాల‌తో తీవ్రంగా స‌త‌మ‌తం అయ్యాను. 24 గంట‌లు ఇవే ఆలోచ‌న‌లు ఉండేవి. వీటిని సరిగ్గా డీల్ చేయ‌లేక‌పోతున్నాను అని భావించాను. అందుక‌నే ఆర్‌సీబీ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పేశాను.’ అని కోహ్లీ ఆర్‌సీబీ పాడ్‌కాస్ట్‌లో ప్రెజెంటర్ మాయంతి లాంగర్‌తో మాట్లాడుతూ తెలిపాడు.

Rohit Sharma-Mohammed Siraj : గుజ‌రాత్‌తో మ్యాచ్‌కు ముందు సిరాజ్‌ను కూల్ చేసిన రోహిత్ శ‌ర్మ‌.. అదిరిపోయే గిఫ్ట్‌..

బ్యాటర్‌గా రాణించడంతో పాటు సంతోషంగా ఉండ‌డం కోసం, త‌రువాత ఏం జ‌రుగుతుంద‌నే టెన్ష‌న్ లేకుండా ఉండ‌డం కోసమే కెప్టెన్సీ వ‌ద్దు అని అనుకున్న‌ట్లుగా వివ‌రించాడు. ఆట‌లో ఎక్కువ రోజులు కొన‌సాగేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపాడు. విజ‌యాలు, ట్రోపీల కంటే త‌న‌కు ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాలే ఎంతో ముఖ్యం అని తెలిపాడు.

మ‌ధ్య‌లో డుప్లెసిస్ గైర్హాజ‌రీలో 2023 లో ఆర్‌సీబీకి నాయ‌క‌త్వం వ‌హించాడు కోహ్లీ. మొత్తంగా కోహ్లీ 143 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీకి నాయ‌క‌త్వం వ‌హించాడు. ఇందులో 66 మ్యాచ్‌ల్లో ఆర్‌సీబీ గెలిచింది. 70 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అత‌డి కెప్టెన్సీ విజ‌య‌శాతం 46.15గా ఉంది. 2016లో అత‌డి సార‌థ్యంలో ఆర్‌సీబీ ఫైన‌ల్‌కు చేరుకుంది. అయితే.. డేవిడ్ వార్న‌ర్ నాయ‌క‌త్వంలోని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో ఓడిపోయి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఆ సీజ‌న్‌లో కోహ్లీ నాలుగు సెంచ‌రీల‌తో స‌హా రికార్డు స్థాయిలో 973 ప‌రుగులు సాధించాడు.

RCB : ఇదెక్కడి ట్విస్ట్ రా అయ్యా.. ఇలా జరిగితే ఐపీఎల్ 2025 నుంచి ఆర్‌సీబీ ఔట్‌?

ప్ర‌స్తుతం ఐపీఎల్ 2025 సీజ‌న్‌లోనూ కోహ్లీ అద‌ర‌గొడుతున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 63.13 స‌గటుతో 505 ప‌రుగులు చేశాడు. ఇందులో ఏడు హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఆర్‌సీబీ 11 మ్యాచ్‌ల్లో 8 విజ‌యాల‌తో ప్ర‌స్తుతం టేబుల్ టాప‌ర్‌గా ఉంది.

కాగా.. ఐపీఎల్ 18 సీజ‌న్లు ఒక్క ప్రాంఛైజీ త‌రుపున ఆడిన ఏకైక ఆట‌గాడిగా కోహ్లీ రికార్డుల‌కు ఎక్కాడు.