Shubman Gill : సైనీ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌.. బిత్త‌ర‌పోయిన గిల్‌.. వీడియో వైర‌ల్‌

దులీప్‌ ట్రోఫీలో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Shubman Gill Stunned As Ex RCB Star Shatters His Stumps

దులీప్‌ ట్రోఫీలో టీమ్ఇండియా వైస్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ ఔట్‌కు సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇండియా-ఏకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న గిల్ ఇండియా-బితో జ‌రుగుతున్న మ్యాచ్‌లో త‌క్కువ ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌ల్లో 43 బంతుల‌ను ఎదుర్కొన్న గిల్ 3 ఫోర్లు కొట్టి 25 ప‌రుగులు చేసి న‌వ‌దీప్ సైనీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

బంతిని అంచ‌నా వేయ‌డంలో గిల్ పొర‌బాటు ప‌డ్డాడు. సైనీ ఆఫ్ స్టంప్ ఆవ‌ల బంతిని వేశాడు. ఆ బంతి నేరుగా వికెట్ కీప‌ర్ చేతుల్లోకి వెలుతుంద‌ని గిల్ భావించాడు. ఈ క్ర‌మంలో ఎలాంటి షాట్ ఆడ‌కుండా బ్యాట్‌ను పైకెత్తి బంతిని వ‌దిలివేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అయితే.. బంతి అనూహ్యంగా లోప‌లికి దూసుకువ‌చ్చి వికెట్ల‌ను గిరాటేసింది. దెబ్బ‌కు గిల్ బిత్త‌ర‌పోయాడు.

Virat Kohli : బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌.. విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మూడు రికార్డులు..

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

కాగా.. ఈ మ్యాచ్‌లో సైనీ బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ అద్భుతంగా రాణించాడు. ఇండియా బి జ‌ట్టు 94 ప‌రుగుల‌కే 7 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన ద‌శ‌లో ముషీర్ ఖాన్ (181)తో క‌లిసి సైనీ గొప్ప‌గా పోరాడాడు. 144 బంతులు ఎదుర్కొని 56 పరుగులు చేశాడు. వీరిద్ద‌రు ఎనిమిదో వికెట్‌కు 205 ప‌రుగుల భారీ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-బి 321 ప‌రుగులు చేసింది.

Shahid Afridi : 37 బంతుల్లో షాహిద్ అఫ్రిది సెంచ‌రీ.. స‌చిన్ టెండూల్క‌ర్‌కు సంబంధం ఉందా..? ఓరి నాయ‌నో..

ఆ త‌రువాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియా-ఏ జ‌ట్టు 35 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 134 ప‌రుగులు చేసింది. రియాన్ ప‌రాగ్ (27), కేఎల్ రాహుల్ (23) క్రీజులో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు