Sikander Raza surpasses virat kohli and Surya Kumar Yadav became most potm
Sikander Raza : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్, కెప్టెన్ సికిందర్ రజా అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ఫుల్ మెంబర్స్ దేశాల్లో అత్యధిక ప్లేయర్ ఆప్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు.
ఈ క్రమంలో అతడు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను అధిగమించాడు. హరారే వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సికిందర్ రజా (Sikander Raza) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవడం ద్వారా ఈ ఘనత అందుకున్నాడు.
CPL 2025 : సీపీఎల్‌లో కీరన్ పొలార్డ్ ఊచకోత.. 6,6,6,6,6.. 4,4,4,4,4
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌లు చెరో 16 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకోగా తాజా దానితో కలిపి రజా 17 అందుకున్నాడు. ఇక ఓవరాల్‌గా అత్యధిక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న రికార్డు మలేసియా ఆటగాడు విరన్‌దీప్ సింగ్ పేరిట ఉంది. అతడు 22 సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు అందుకున్న ఆటగాళ్లు వీరే..
* విరన్‌దీప్ సింగ్ (మలేషియా) – 22 సార్లు
* సికిందర్ రజా (జింబాబ్వే) – 17 సార్లు
* విరాట్ కోహ్లీ (భారత్) – 16 సార్లు
* సూర్యకుమార్ యాదవ్ (భారత్) – 16 సార్లు
* మహ్మద్ నబీ (అఫ్గానిస్థాన్) – 14 సార్లు
* రోహిత్ శర్మ (భారత్) – 14 సార్లు
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. జింబాబ్వే బౌలర్ల ధాటికి 17.4 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో కమిల్ మిషారా (20), చరిత్ అసలంక (18), దాసున్ షనక (15) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. జింబాబ్వే బౌలర్లలో సికిందర్ రజా తన 4 ఓవర్ల కోటా బౌలింగ్‌లో కేవలం 11 పరుగులకే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. మిగిలిన వారిలో బ్రాడ్ ఎవాన్స్ మూడు వికెట్లు తీయగా, ముజారబానీ రెండు వికెట్లు సాధించాడు.
ZIM vs SL : శ్రీలంకకు బిగ్ షాక్.. రెండో టీ20లో జింబాబ్వే సంచలన విజయం..
అనంతరం 81 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే 14.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. జింబాబ్వే బ్యాటర్లలో తషింగా ముసేకివా (21), ర్యాన్ బర్ల్ (20),బ్రియాన్ బెన్నెట్(19), తాడివానాషే మారుమణి (17) లు రాణించారు.