SL incensed after third umpire overturns Soumya Sarkar dismissal
SL vs BAN 2nd T20 : క్రికెట్‌లో కొన్ని సార్లు థర్డ్ అంపైర్లు తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా శ్రీలంక, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం పై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఫీల్డ్ అంపైర్ ఔట్ అని ఇచ్చినా, అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తాకినట్లుగా స్పైక్ కనిపించినప్పటికీ థర్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఆటగాళ్లు, మైదానంలోని ఫీల్డ్ అంపైర్లతో పాటు ప్రేక్షకులు ఆశ్చర్యపోయ్యారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. లంక బ్యాటర్లలో కుశాల్ మెండీస్(36), కమిందు మెండిస్ (37), ఏంజెలో మాథ్యూస్ (32) లు రాణించారు. అనంతరం లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 18.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. బంగ్లా బ్యాటర్లలో కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో (53నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. లిటన్ దాస్ (36), తౌహిద్ హృదయ్ (32నాటౌట్) లు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.
Shreyas Iyer : బాలీవుడ్ హీరోయిన్‌తో శ్రేయస్ అయ్యర్ ప్రేమ ?
అంపైర్ ఔటిచ్చినా..?
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను లంక పేసర్ బినురా ఫెర్నాండో వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతికి బంగ్గా ఓపెనర్ సౌమ్య సర్కార్ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా బాల్ వికెట్ కీపర్ చేతుల్లో పడింది. వికెట్‌కీపర్, బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఔట్ అంటూ అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔట్ అని ప్రకటించాడు. సౌమ్య రివ్యూకి వెళ్లాడు.
అయితే బంతి బ్యాట్‌ను దాటినట్లు కనిపించిన సమయంలో పెద్ద స్క్రీన్ స్పష్టమైన స్పైక్ కనిపించింది. దీంతో సౌమ్య మైదానం నుంచి బయటకు వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. అయితే థర్డ్ అంపైర్ రెహమాన్.. స్పైక్ బంతిపై బ్యాట్ తాకడం వల్ల రాలేదని, వేరే శబ్దం వల్ల వచ్చిందని భావించాడు. అల్ట్రా-ఎడ్జ్‌లో స్పైక్ కనిపించిన సమయంలో బ్యాట్, బాల్ మధ్య “క్లియర్ గ్యాప్” ఉందని అతను చెప్పాడు. ఈ క్రమంలో తన నిర్ణయాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు.
దీంతో లంక ఆటగాళ్లతో పాటు అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యారు. లంక ఆటగాళ్లు ఆన్‌ఫీల్డ్ అంపైర్లతో చర్చించారు. వారికి అంపైర్లు నచ్చజెప్పడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. కాగా.. ఆ సమయంలో 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సౌమ్య సర్కార్.. చివరికి 26 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.
PSL 2024 : కన్‌ఫ్యూజన్ కింగ్..! అటు.. ఇటు.. చివరికి.. నవ్వులు పూయిస్తున్న వీడియో
కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. థర్డ్ అంపైర్‌కు కళ్లు కనిపించడం లేదా? అతడు చెప్పేదే నిజం అనుకుంటే శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో చెబితే బాగుంటుంది, ఇలాంటి థర్డ్ అంపైర్ అంటే బంగ్లాదేశ్ ఏ మ్యాచ్‌లోనూ ఓడిపోదని, అన్ని ప్రపంచకప్‌లు బంగ్లాదేశ్‌కేనని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
DRAMA! Clear noise > on-field umpire signals out > review taken > 3rd umpire rules not out despite UltraEdge!
Bangladesh-Sri Lanka always throws up a controversy ?
.
.#BANvsSL #FanCode pic.twitter.com/8hH9i65SD6— FanCode (@FanCode) March 6, 2024