SMAT 2025 : యశస్వి జైస్వాల్ సూపర్ సెంచరీ, సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీ.. ముంబై ఘన విజయం..
టీమ్ఇండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్‌లు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో (SMAT 2025) అదరగొడుతున్నారు.
SMAT 2025 Yashasvi Jaiswal century mumbai won by 4 wickets against Haryana
SMAT 2025 : టీమ్ఇండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్‌లు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో అదరగొడుతున్నారు. పూణేలోని డివై పాటిల్ అకాడమీ వేదికగా ఆదివారం హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ శతకంతో చెలరేగగా.. సర్ఫరాజ్ ఖాన్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో 235 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ముంబై విజేతగా నిలిచింది.
ఈ మ్యాచ్‌లో హర్యానా జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. హర్యానా బ్యాటర్లలో అంకిత్ కుమార్ (89; 42 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు), నిశాంత్ సింధు (63 నాటౌట్; 38 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. సమంత జాఖర్ (31; 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. ముంబై బౌలర్లలో సైరాజ్ పాటిల్ రెండు వికెట్లు తీశాడు.
Lionel Messi : మెస్సీ భారత్‌లో పూర్తి స్థాయి మ్యాచ్ ఎందుకు ఆడడు? ఇన్సూరెన్స్ తో లింక్ ఏంటి?
A STANDING OVATION FOR YASHASVI JAISWAL IN SMAT – 101(50) 🔥😍 pic.twitter.com/5mbf6Kieun
— Johns. (@CricCrazyJohns) December 14, 2025
ఆ తరువాత యశస్వి జైస్వాల్ (101; 50 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగగా సర్ఫరాజ్ ఖాన్ (64; 25 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో 235 పరుగుల లక్ష్యాన్ని ముంబై 17.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. హర్యానా బౌలర్లలో సమంత జాఖర్ రెండు వికెట్లు తీశాడు.
కాగా.. టీ20ల్లో యశస్వి జైస్వాల్‌కు ఇది నాలుగో సెంచరీ.
