సోఫియా సెన్సేషనల్ కామెంట్స్ : రోహిత్ శర్మతో నిజమే

  • Published By: madhu ,Published On : January 24, 2019 / 03:17 PM IST
సోఫియా సెన్సేషనల్ కామెంట్స్ : రోహిత్ శర్మతో నిజమే

Updated On : January 24, 2019 / 3:17 PM IST

ఢిల్లీ : టీంఇండియా క్రికెటర్ రోహిత్ శర్మపై నటి సోఫియా హయత్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.  రోహిత్ శర్మతో ఒకప్పుడు డేటింగ్ చేసిన మాట నిజమేనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే అది ఒకప్పటి మాట అని ఇప్పుడు మాత్రం తిరిగి అతనితో కలవనని కామెంట్ చేసింది. 2012లో రోహిత్‌ని లండన్‌లోని ఓ క్లబ్‌లో తొలిసారి ఇద్దరం ఏకాంతంగా కలిశామని చెప్పింది.

 

అప్పటికి అతను క్రికెటర్ అని తెలీదని కూడా చెప్తోన్న సోఫియా హయత్ గతంలోనూ వారిద్దరి ఫోటోలను పోస్ట్ చేసింది. మీడియా కంటపడనంత వరకూ తమ ప్రణయం సాగగా..ఎప్పుడైతే అందరికీ ఈ విషయం తెలిసిందో..అప్పుడో రోహిత్ శర్మ తనని ఎవాయిడ్ చేసాడంటూ చెప్పుకొచ్చింది. గతంలో రోహిత్ శర్మ భారీగా పరుగులు సాధించిన సందర్భంలో సోఫియా హయత్ న్యూడ్ ఫోటో షూట్‌ని అతనికి అంకితం చేస్తున్నట్లు చెప్తూ..పోస్టులు పెట్టేది. బుద్దిజం తీసుకున్నానని..జీసస్ తనకి పుట్టబోతున్నాడని..ఇలా రకరకాల వివాదాస్పద వ్యాఖ్యలతో ఈ మధ్యవరకూ కలకలం రేపిన సోఫియా..తాజాగా రోహిత్ శర్మ ప్రస్తావనతో మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తోందని కొందరు కామెంట్ చేస్తున్నారు.