Sourav Ganguly : తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్న గంగూలీ.. ఆ స‌మాచారం ఎక్క‌డ లీక్ అవుతుందోన‌ని!

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఇంటిలో దొంగ‌త‌నం జ‌రిగింది.

Sourav Ganguly's mobile was stolen from home troubled by this

Sourav Ganguly mobile stolen : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ ఇంటిలో దొంగ‌త‌నం జ‌రిగింది. ఆయ‌న ఖ‌రీదైన ఫోన్ చోరీకి గురైంది. ఆ ఫోన్ ఖ‌రీదు రూ.1.6ల‌క్ష‌లు. దీంతో ఆందోళ‌న చెందిన మాజీ కెప్టెన్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. త‌న ఫోన్‌లో వ్య‌క్తిగ‌త స‌మాచారం ఉందని, అది దుర్వినియోగం కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరాడు.

కోల్‌క‌తాలోని బెహ‌లాలోని గంగూలీ నివాసానికి పెయింగ్ ప‌ని చేస్తున్నారు. గంగూలీ త‌న నివాసంలో ఓ చోట ఫోన్‌ను పెట్టి బ‌య‌ట‌కు వెళ్లారు. ప‌ని పూర్తి చేసుకుని తిరిగి వ‌చ్చి చూసే స‌రికి ఫోన్ క‌నిపించ‌లేదు. దీంతో ఆందోళ‌న చెందిన దాదా ఇళ్లంతా వెతికినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

Shamar Joseph : వెస్టిండీస్ న‌యా సంచ‌ల‌నానికి బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. ఐపీఎల్‌లో ఎంట్రీ.. రూ.3కోట్ల‌కు డీల్‌

ఫిర్యాదులో ఏముందంటే..?

“నా ఫోన్ ఇంటి నుంచి దొంగిలించబడిందని భావిస్తున్నాను. చివరిసారిగా జనవరి 19 ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఫోన్‌ని చూశాను. ఇళ్లంతా వెదికాను. అయితే..ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఫోన్ పోయినందుకు తీవ్ర ఆందోళన చెందాను. ఎందుకంటే ఫోన్‌లో నంబ‌ర్లు, వ్యక్తిగత సమాచారం ఉంది. ఫోన్‌ను ట్రేస్ చేయమని లేదా తగిన చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను అని గంగూలీ ఫిర్యాదులో పేర్కొన్న‌ట్లు హిందుస్థాన్ టైమ్స్ బంగ్లా పేర్కొంది. త‌న ఫోన్‌లోని ప‌ర్స‌న‌ల్ డేటా ఉంద‌ని, అది లీక్ అయితే త‌న‌కు పెద్ద స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని చెప్పాడు. గంగూలీ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Viral Video : బ్యాట‌ర్ ఏదో క‌నిక‌ట్టు చేసిన‌ట్లు ఉన్నాడుగా..!

టీమ్ఇండియాకు దూకుడు నేర్పిన గంగూలీ భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కి అధ్య‌క్షుడిగా ప‌ని చేశాడు. ప్ర‌స్తుతం ఆయ‌న ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టుకు డైరెక్ట‌ర్ ఆఫ్ క్రికెట్ గా సేవ‌లు అందిస్తున్నాడు.

ట్రెండింగ్ వార్తలు