Shamar Joseph : వెస్టిండీస్ నయా సంచలనానికి బంఫర్ ఆఫర్.. ఐపీఎల్లో ఎంట్రీ.. రూ.3కోట్లకు డీల్
వెస్టిండీస్ జట్టు నయా బౌలింగ్ సంచలనం షెమర్ జోసెఫ్ కు బంఫర్ ఆఫర్ లభించింది.
West Indies pacer Shamar Joseph : వెస్టిండీస్ జట్టు నయా బౌలింగ్ సంచలనం షెమర్ జోసెఫ్ కు బంఫర్ ఆఫర్ లభించింది. ఇటీవల గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో సంచలన స్పెల్‌తో వెస్టిండీస్‌కు నమ్మశక్యం గానీ విజయాన్ని అందించాడు. ఆసీస్ గడ్డ పై దాదాపు 27 ఏళ్ల తరువాత విండీస్ గెలవడం విశేషం. దీంతో ఈ 24 ఏళ్ల కుర్రాడి పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతుంది.
తాజాగా ఈ ఆటగాడు ఐపీఎల్ 2024 సీజన్లో ఆడనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ మేరకు లక్నో జట్టు అతడితో ఒప్పందం చేసుకుంది. ఈ విషయాన్ని లక్నో జట్టు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మార్క్‌వుడ్ స్థానంలో అతడికి తీసుకున్నట్లు తెలిపింది. రూ.3కోట్లతో అతడితో ఒప్పందం చేసుకుంది.
No Ball Six Hit wicket : ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. ఒకే బంతికి నోబాల్, సిక్స్, హిట్‌వికెట్..
కాగా..జోసెఫ్‌కు ఇదే మొదటి ఐపీఎల్ సీజన్ కావడం గమనార్హం. తొలి సీజన్‌కే మూడు కోట్లు అంటే మామూలు విషయం కాదు. కాగా.. మార్క్‌వుడ్‌ను ఎందుకు రిప్లేస్ చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2022లో మార్క్‌వుడ్‌ను రూ.7కోట్లకు లక్నో కొనుగోలు చేసింది.
గబ్బా టెస్టు మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో షెమర్ జోసెఫ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో అతడికి కాలికి గాయమైంది. అయినప్పటికీ నొప్పిని భరిస్తూ రెండో ఇన్నింగ్స్‌లో కంగారూలకు వణుకుపుట్టించాడు. ఏడు వికెట్లు తీసి ఆసీస్ జట్టును కుప్పకూల్చాడు. ఈ ప్రదర్శనతో జోసెఫ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాంఛైజీల కన్నుపడింది ఇంటర్నేషనల్ లీగ్ టీ20(ఐఎల్టీ20)లో ఢిల్లీ తరుపున ఆడుతుండగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కూడా అవకాశం వచ్చింది.
Viral Video : బ్యాటర్ ఏదో కనికట్టు చేసినట్లు ఉన్నాడుగా..!
🚨 Big signing for LSG! Shamar Joseph joins the franchise to replace injured Mark Wood. pic.twitter.com/9FTbLFH9HJ
— CricketGully (@thecricketgully) February 10, 2024