Sarfaraz Khan: బీసీసీఐ వాదనల్లో నిజంలేదు.. సర్ఫరాజ్ ఖాన్ ఎప్పుడూ ఎవరి పట్ల అగౌరవంగా ప్రవర్తించలేదు..

సర్ఫరాజ్ ఖాన్ భారత్ జట్టులో ఎంపిక కాకపోవటానికి ఫిట్‌నెస్ ఒక కారణం అయితే, మరికొన్ని కారణాలను బీసీసీఐ అధికారి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వాటిని సర్ఫరాజ్ సన్నిహితులు ఖండించారు.

Sarfaraz Khan

Sarfaraz Khan: టీమిండియా (Team India) జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్‌ (West Indies) లో టెస్ట్, వన్డే సిరీస్‌లు ఆడనుంది. ఇందుకోసం సెలెక్టర్ల కమిటీ  (Selectors Committee) రెండు ఫార్మాట్లలో టీం సభ్యులను ప్రకటించింది. ఇందులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) పేరు లేకపోవటం పెద్ద దుమారాన్ని రేపుతోంది. సర్ఫరాజ్ పేరు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని పలువురు మాజీ క్రికెటర్లు సెలెక్టర్ల కమిటీని ప్రశ్నించారు. రంజీల్లో సర్ఫరాజ్ అద్భుతంగా రాణిస్తున్నాడు, మెరుగైన రన్ రేట్ ఉంది అయినా ఎందుకు వెస్టిండీస్ టూర్ జట్టులో సర్ఫరాజ్ పేరు లేదని సోషల్ మీడియాలోనూ విస్తృతంగా చర్చ జరుగుతుంది. దీంతో బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు. సర్ఫరాజ్‌ను ఎంపిక చేయకపోవటానికి గల కారణాలను వివరించారు.

Sarfaraz Khan: సర్ఫరాజ్‌ను వెస్టిండీస్ పర్యటనకు ఎందుకు ఎంపిక చేయలేదు.. బీసీసీఐ అధికారి ఏమన్నారంటే..

సర్ఫరాజ్ ఖాన్ భారత్ జట్టులో ఎంపిక కాకపోవటం వెనుక ఫిట్‌నెస్ ఒక కారణం అయితే, క్రమశిక్షణ లేకపోవటం మరో కారణంగా బీసీసీఐ అధికారి చెప్పారు. ఢిల్లీలో జరిగిన మ్యాచ్ సర్ఫరాజ్ సెంచరీ చేసిన తరువాత డ్రెస్సింగ్ రూం వైపు వేలు చూపుతూ సంజ్ఙ చేశాడని, ఆ సమయంలో అక్కడ మ్యాచ్ ను వీక్షిస్తుంది సెలెక్టర్ల కమిటీ సభ్యుడని బీసీసీఐ అధికారి తెలిపారు. పలు సందర్భంల్లో సర్ఫరాజ్ ఖాన్ హద్దుమీరి ప్రవర్తించారని తెలిపారు. అదేవిధంగా ఇలాంటి తరహా ఘటనలే మరికొన్ని సెలక్టర్ల కమిటీ దృష్టికి వచ్చాయని, ఈ కారణంగానే సెలక్టర్ల కమిటీ అతని పేరును పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ అధికారి తెలిపారు. అయితే, సర్ఫరాజ్ ఖాన్ సన్నిహిత వర్గాలు బీసీసీఐ అధికారి వాదనల్లో నిజంలేదని పీటీఐకి తెలిపాయి.

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్.. ఇన్‌స్టా‌గ్రామ్ స్టోరీలో వీడియో.. బీసీసీఐకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడా?

ఢిల్లీతో రంజీ మ్యాచ్‌లో శతకం తర్వాత తొడగొట్టి ఓ బీసీసీఐ సెలక్టర్ వైపు వేలు చూపిస్తూ వెక్కిరించేలా సర్ఫరాజ్ సంబరాలు చేసుకున్నాడని బీసీసీఐ వర్గాలు చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని సర్ఫరాజ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. సర్ఫరాజ్ వేలు చూపిన సమయంలో సెలక్టర్ చేతన్ శర్మ అక్కడే ఉన్నారని బీసీసీఐ వర్గాలు చెప్పాయి.. కానీ, ఆ సమయంలో అక్కడ ఉంది చేతన్ శర్మ కాదు, సలీల్ అంకోలా అంటూ సర్ఫరాజ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయినా, సర్ఫరాజ్ ఖాన్ దురుద్దేశంతో అలా ప్రవర్తించలేదని, జట్టు కష్టల్లో ఉన్న సమయంలో సెంచరీ చేసినందుకు ఆనందాన్ని ఆ విధంగా వ్యక్తం చేశాడట.

Sarfaraz Naushad Khan: నా కుమారుడు అన్న ఆ ఒక్క మాట నా హృదయాన్ని కరిగించింది: సర్ఫరాజ్ ఖాన్ తండ్రి

మరోవైపు సర్ఫరాజ్ ప్రవర్తన పట్ల మధ్యప్రదేశ్ కోచ్ చంద్రకాంత్ చిరాకు పడ్డాడనేదికూడా నిజంకాదట. 14ఏళ్ల వయస్సు నుంచి అతని గురించి చంద్రకాంత్‌కు తెలుసు. అతనెప్పుడూ సర్ఫరాజ్‌పై కోప్పడలేదు అని సర్ఫరాజ్ ప్రతినిధి ఒకరు చెప్పారు. మొత్తానికి సర్ఫరాజ్ వ్యవహారం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. మాజీ క్రికెటర్ల నుంచేకాక, సోషల్ మీడియా వేదికగానూ బీసీసీఐపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు