Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్.. ఇన్‌స్టా‌గ్రామ్ స్టోరీలో వీడియో.. బీసీసీఐకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడా?

విండీస్ టూర్‌కు ఎంపికచేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవటంతో సెలెక్టర్ల కమిటీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తన మౌనాన్ని వీడాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను పోస్టు చేశారు.

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్.. ఇన్‌స్టా‌గ్రామ్ స్టోరీలో వీడియో.. బీసీసీఐకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడా?

Sarfaraz Khan

Sarfaraz Khan Counter To BCCI: టీమిండియా (Team india) జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్‌ (West Indies Tour) కు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే, వెస్టిండీస్ పర్యటనకోసం టీమిండియా టెస్ట్, వన్డే జట్టును శుక్రవారం బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ముఖ్యంగా టెస్టు జట్టు ఎంపికలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే ((Ajinkya Rahane) వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టెస్టుల స్పెషలిస్టుగా చెప్పుకొనే ఛతేశ్వర్ పుజారా‌ను పక్కన పెట్టారు. యువ ఆటగాళ్లు యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లు టెస్టు జట్టులో ఎంపికయ్యారు.

Aakash Chopra: దేశవాళీ రికార్డులు పనికిరావా..! సర్ఫరాజ్ ఏం చేయాలి..? బీసీసీఐని ప్రశ్నించిన భారత మాజీ ఓపెనర్

విండీస్‌కు వెళ్లే టెస్టు జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) పేరు లేకపోవటంతో పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ టార్గెట్‌గా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు. సర్ఫరాజ్ ఏం పాపం చేశాడంటూ ప్రశ్నించారు? సునీల్ గవాస్కర్‌సైతం పుజారా తొలగింపు, సర్ఫరాజ్‌ను ఎంపిక చేకపోవటం పట్ల సెలక్టర్లపై విమర్శలు గుప్పించారు. ఐపీఎల్‌లో ప్రదర్శన చేసిన వారికే జట్టులో ఎంపికకు ప్రాధాన్యతనిస్తే రంజీలు ఆడించడం ఎందుకు అని ప్రశ్నించారు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా బ్యాటింగ్ యూనిట్ మొత్తం ఫెయిల్ అయ్యింద‌ని, అలాంట‌ప్పుడు పుజారాను ఒక్క‌డిపైనే వేటు వేయ‌డం స‌రికాద‌ని గవాస్కర్ అభిప్రాయ పడ్డారు. మూడేళ్లుగా దేశ‌వాలీ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్న స‌ర్ఫ‌రాజ్ ఖాన్‌ను ఎంపిక చేయ‌క‌పోవ‌డాన్ని గ‌వాస్క‌ర్ త‌ప్పుబ‌ట్టాడు.

WI vs IND : టీమ్ సెల‌క్ష‌న్ పై మండిపాటు.. న‌లుగురు ఓపెన‌ర్లు దేని కోసం..? సెల‌క్ట‌ర్ల‌కు అవ‌గాహ‌న లేదు..?

విండీస్ టూర్‌కు ఎంపికచేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవటంతో సెలెక్టర్ల కమిటీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తన మౌనాన్ని వీడాడు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను పోస్టు చేశారు. ఆ వీడియోలో తాను ఆడిన రంజీ ట్రోఫీ సీజన్ హైలెట్స్ ఉన్నాయి. ఈ స్టోరీకి క్యాప్షన్ ఏమీ రాయలేదు. అయితే, రంజీల్లో తాను ఆడిన మ్యాచ్ లు, పరుగులు, తదితర వివరాలు ఉన్నాయి. దీంతో సర్ఫరాజ్ బీసీసీఐకి వీడియోద్వారా తన గణాంకాలను చూపుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారన్న చర్చ క్రికెట్ వర్గాల్లో జరుగుతుంది.

 

Sarfaraz Khan

Sarfaraz Khan