Sarfaraz Khan: సర్ఫరాజ్‌ను వెస్టిండీస్ పర్యటనకు ఎందుకు ఎంపిక చేయలేదు.. బీసీసీఐ అధికారి ఏమన్నారంటే..

వెస్టిండీస్‌లో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు ఎందుకు అవకాశం కల్పించలేదో కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

Sarfaraz Khan: సర్ఫరాజ్‌ను వెస్టిండీస్ పర్యటనకు ఎందుకు ఎంపిక చేయలేదు.. బీసీసీఐ అధికారి ఏమన్నారంటే..

Sarfaraz Khan

Sarfaraz Khan- BCCI: టీమిండియా (Team india) జట్టు వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్‌ (West Indies Tour)కు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే, వెస్టిండీస్ పర్యటనకోసం టీమిండియా టెస్ట్, వన్డే జట్టును శుక్రవారం బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ముఖ్యంగా టెస్టు జట్టు ఎంపికలో బీసీసీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే, విండీస్‌కు వెళ్లే టెస్టు జట్టులో సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) పేరు లేకపోవటంతో పలువురు మాజీ క్రికెటర్లు బీసీసీఐ టార్గెట్‌గా ప్రశ్నిస్తున్నారు.

Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్.. ఇన్‌స్టా‌గ్రామ్ స్టోరీలో వీడియో.. బీసీసీఐకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడా?

భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపించారు. సర్ఫరాజ్ ఏం పాపం చేశాడంటూ ప్రశ్నించారు? సునీల్ గవాస్కర్‌సైతం సర్ఫరాజ్‌ను ఎంపిక చేకపోవటం పట్ల సెలక్టర్లపై విమర్శలు గుప్పించారు. ఐపీఎల్‌లో ప్రదర్శన చేసిన వారికే జట్టులో ఎంపికకు ప్రాధాన్యతనిస్తే రంజీలు ఆడించడం ఎందుకు అని ప్రశ్నించారు. మాజీ క్రికెటర్లకుతోడు సోషల్ మీడియాలోనూ సర్ఫరాజ్ ను బీసీసీఐ విస్మరించడం పట్ల నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో బీసీసీఐ అధికారి ఒకరు సర్ఫరాజ్ ను వెస్టిండీస్ టూర్‌కు వెళ్లే జట్టులో ఎందుకు చోటు కల్పించలేదో కారణాలను వివరించారు.

Ravi Shastri : ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత అత‌డే కెప్టెన్.. రోహిత్ ఇక చాలు

బీసీసీఐ అధికారి మాట్లాడుతూ.. సర్ఫరాజ్ ఖాన్ ఫిట్‌నెస్ విషయంలో చాలా కష్టపడాలి. బరువు తగ్గాలి అని అన్నారు. బ్యాటింగ్ ఫిట్‌నెస్ మాత్రమే ఎంపికకు ప్రమాణ కాదు. ఫిట్‌నెస్‌తో పాటు మైదానం లోపల, వెలుపల సర్ఫరాజ్ వైఖరికూడా క్రమ శిక్షణ యొక్క ప్రమాణాలకు అనుగుణంగా లేదని బీసీసీఐ అధికారి తెలిపారు. ఈ ఏడాది ఆరంభంలో ఢిల్లీతో జరిగిన రంజీ మ్యాచ్‌‌లో ఢిల్లీపై సెంచరీ సాధించిన తరువాత సర్ఫరాజ్ దూకుడుగా సంబరాలు చేసుకోవడం సెలెక్టర్లకు చిరాకు తెప్పించిందన్న వాదనను బీసీసీఐ అధికారి వెలుబుచ్చారు.

CWC Qualifier 2023 : వెస్టిండీస్‌కు వ‌రుస షాక్‌లు.. జింబాబ్వే చేతిలో ఓట‌మి.. ఐసీసీ జ‌రిమానా

ఆ సమయంలో చీఫ్ సెలక్షన్ కమిటీ చీఫ్ చేతన్ శర్మ స్టేడియంలో ఉన్నారు. 2022 రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లోనూ మధ్యప్రదేశ్ కోచ్, మాజీ ముంబై లెజెండ్ చంద్రకాంత్ పండిట్ పట్ల సర్ఫరాజ్ వ్యవహరించిన తీరు సరిగా లేదని బీసీసీఐ అధికారి ప్రస్తావించారు. ఐపీఎల్ టోర్నీలో పరుగులు రాబట్టనందుకే సర్ఫరాజ్ ను ఎంపిక చేయలేదా? అనే ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని బీసీసీఐ అధికారి బదులిచ్చారు. అదంతా మీడియా సృష్టించిన అభిప్రాయం అని చెప్పారు.