CWC Qualifier 2023 : వెస్టిండీస్‌కు వ‌రుస షాక్‌లు.. జింబాబ్వే చేతిలో ఓట‌మి.. ఐసీసీ జ‌రిమానా

జింబాబ్వే వేదిక‌గా వ‌రల్డ్ క‌ప్ క్వాలిఫ‌యర్స్ టోర్నీ జ‌రుగుతోంది. అతిథ్య జింబాబ్వే(Zimbabwe) రెండు సార్లు ప్ర‌పంచ‌క‌ప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్(West Indies ) జ‌ట్టుకు గ‌ట్టి షాక్ ఇచ్చింది.

CWC Qualifier 2023 : వెస్టిండీస్‌కు వ‌రుస షాక్‌లు.. జింబాబ్వే చేతిలో ఓట‌మి.. ఐసీసీ జ‌రిమానా

West Indies

CWC Qualifier : జింబాబ్వే వేదిక‌గా వ‌రల్డ్ క‌ప్ క్వాలిఫ‌యర్స్ టోర్నీ జ‌రుగుతోంది. అతిథ్య జింబాబ్వే(Zimbabwe) రెండు సార్లు ప్ర‌పంచ‌క‌ప్ విజేతగా నిలిచిన వెస్టిండీస్(West Indies ) జ‌ట్టుకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఈ ఓట‌మితో వెస్టిండీస్ ప్ర‌పంచ‌క‌ప్ ఆడే అవ‌కాశాలు కాస్త క‌ష్టం అయ్యాయి. అస‌లే ఓట‌మి బాధ‌లో ఉన్న విండీస్ కు ఐసీసీ(ICC) గ‌ట్టి షాక్ ఇచ్చింది. జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచ్‌లో స్లో ఓవ‌ర్ రేట్(Slow Over Rate) మెయిన్‌టైన్‌ చేసినందుకు విండీస్ ఆట‌గాళ్ల మ్యాచ్ ఫీజులో 60 శాతం కోత విధించింది.

నిర్ణీత స‌మ‌యానికి విండీస్ మూడు ఓవ‌ర్లు త‌క్కువ‌గా వేసింది. ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం నిర్ణీత స‌మ‌యానికి ఒక్క ఓవ‌ర్‌ను త‌క్కువ‌గా వేస్తే 20 శాతం ఆట‌గాళ్లకు జ‌రిమానా విధిస్తారు. విండీస్ మూడు ఓవ‌ర్లు త‌క్కువ‌గా వేయ‌డంతో ఆట‌గాళ్ల మ్యాచ్ ఫీజులో 60 కోత ప‌డింది. విండీస్ కెప్టెన్ త‌ప్పును, జ‌రిమానా ను అంగీక‌రించాడు. దీంతో ఎలాంటి అధికారిక విచార‌ణ ఉండ‌ద‌ని ఐసీసీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ICC World Cup 2023 : ఐసీసీ కీల‌క అప్‌డేట్‌.. ఆగ‌స్ట్ 29 డెడ్ లైన్‌.. దేనికంటే..?

జింబాబ్వే సంచ‌ల‌న విజ‌యం

వెస్టిండీస్‌, జింబాబ్వే జ‌ట్ల మ‌ధ్య శ‌నివారం జ‌రిగిన మ్యాచ్‌లో విండీస్ 35 పరుగుల తేడాతో ఓట‌మి పాలైంది. మొద‌ట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే సికింద‌ర్ రజా(68), ర్యాన్ బ‌ర్ల్‌(50), క్రెయిగ్ ఎర్విన్‌(47) రాణించ‌డంతో 49.5 ఓవ‌ర్ల‌లో 268 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో విండీస్ 44.4 ఓవ‌ర్ల‌లో 233 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. విండీస్ బ్యాట‌ర్ల‌లో కైల్ మేయ‌ర్స్‌(56), రోస్ట‌న్ ఛేజ్‌(44), నికోల‌స్ పూర‌న్‌(34)లు రాణించినా మిగిలిన వారు దారుణంగా విఫ‌లం అయ్యారు. జింబాబ్వే బౌల‌ర్ల‌లో చ‌టార మూడు వికెట్లు తీయ‌గా, సికింద‌ర్ ర‌జా, ఎంగర‌వ‌, ముజ‌ర‌బాని త‌లా రెండు వికెట్లు తీశారు.

1983 World Cup : ప‌సికూన అనుకున్న జ‌ట్టు.. విశ్వ‌విజేత‌గా నిలిచి 40 ఏళ్లు

ఇక ఈ మ్యాచ్‌లో ఓడిన‌ప్ప‌టికి వెస్టిండీస్ సూప‌ర్‌-6కు అర్హ‌త సాధించింది. విండీస్‌తో పాటు గ్రూప్ ఏ నుంచి జింబాబ్వే. నెద‌ర్లాండ్స్ లు ముందంజ వేశాయి. నేపాల్‌, అమెరికాలు ఇంటి ముఖం ప‌ట్టాయి. గ్రూప్‌-బి నుంచి సూప‌ర్ సిక్స్ ద‌శ‌కు చేరే జ‌ట్లు ఇంకా తెలియ‌రాలేదు.