టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సౌతాఫ్రికా

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి సౌతాఫ్రికా దూసుకెళ్లింది. గ్రూప్ 2లో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.

టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సౌతాఫ్రికా

South Africa Beat by 3 wkts West Indies To Reach T20 World Cup Semi Finals (Photo: @ICC)

T20 World Cup WI vs SA: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లోకి సౌతాఫ్రికా దూసుకెళ్లింది. సూపర్ 8లో గ్రూప్ 2లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూప్ 2లో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. 4 పాయింట్లతో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. వెస్టిండీస్, అమెరికా టోర్నమెంట్ నుంచి నిష్ర్కమించాయి.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 135 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 42 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 52 పరుగులు చేశాడు. కైల్ మేయర్స్ 35 పరుగులు సాధించాడు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. సౌతాఫ్రికా బౌలర్లలో షమ్సీ 3 వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్, మార్క్రామ్, కేశవ్ మహరాజ్, రబడ తలో వికెట్ తీశారు.

మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను కుదించారు. సౌతాఫ్రికాకు 17 ఓవర్లలో 123 పరుగుల టార్గెట్ పెట్టారు. 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా 124 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. స్టబ్స్ 29, క్లాసెన్ 22, మార్కో జాన్సెన్ 21, మార్క్రామ్ 18, డికాక్ 12 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ చేజ్ 3 వికెట్లు తీశాడు. రసెల్, జోసఫ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.

Also Read: ఆస్ట్రేలియాపై విజయంతో అఫ్గాన్ ప్లేయర్ల సంబరాలు చూశారా.. వీడియో వైరల్