×
Ad

IND vs SA : క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఏ జ‌ట్టుకు సాధ్యం కాని రికార్డుపై క‌న్నేసిన ద‌క్షిణాఫ్రికా.. గంభీర్ ప‌ని గోవిందా!

గౌహ‌తి వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs SA ) ద‌క్షిణాఫ్రికా ప‌ట్టు బిగించింది.

South Africa Team On The Verge Of History No Other Team Has Done To India

IND vs SA : గౌహ‌తి వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ప‌ట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో స‌ఫారీ జ‌ట్టు 489 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత బౌలింగ్‌లో విజృంభించి భార‌త్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 201 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసింది. దీంతో ద‌క్షిణాఫ్రికాకు 288 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. మ‌రో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న నేప‌థ్యంలో భార‌త్ ఈ మ్యాచ్‌లో గెల‌వ‌డం దాదాపు అసాధ్యం.

ఒక‌వేళ ఈ మ్యాచ్‌లో (IND vs SA)ద‌క్షిణాఫ్రికా విజ‌యం సాధిస్తే.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఏ జ‌ట్టుకు సాధ్యం కాని ఓ రికార్డును అందుకుంటుంది. స్వ‌దేశంలో భార‌త్‌ను రెండు సార్లు వైట్ వాష్ చేసిన జ‌ట్టుగా చ‌రిత్ర సృష్టిస్తుంది. టెస్టుల్లో టీమ్ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు స్వ‌దేశంలో రెండు సార్లు మాత్ర‌మే ప్ర‌త్య‌ర్థుల చేతిలో వైట్‌వాష్ కు గురైంది.

Team India : వంద ప‌రుగులు దేవుడికి ఎరుక‌.. క‌నీసం 100 బంతులు ఆడ‌లేక‌పోతున్నారుగా.. కుల్దీప్ నువ్వు తోప‌య్యా..

2000 సంవ‌త్స‌రంలో హ‌న్సీ క్రానే నేతృత్వంలోని ద‌క్షిణాఫ్రికా జ‌ట్టు భార‌త్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. గ‌తేడాది టాప్ లాథ‌మ్ సార‌థ్యంలోని న్యూజిలాండ్ జ‌ట్టు 3-0 తేడాతో భార‌త్‌ను చిత్తు చేసింది.

1980లో బీసీసీఐ 50 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకున్న సంద‌ర్భంలో ముంబై వేదిక‌గా ఇంగ్లాండ్‌తో ఒకే ఒక టెస్టు మ్యాచ్‌ను నిర్వ‌హించారు. ఆ మ్యాచ్‌లో భార‌త్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సాంకేతికంగా ఒకే మ్యాచ్ ఆడ‌డాన్ని సిరీస్‌గా ప‌రిగ‌ణించరు.

Yashasvi Jaiswal : ఉస్మాన్ ఖవాజా, జాక్ క్రాలీ రికార్డులు బ్రేక్‌.. య‌శ‌స్వి జైస్వాల్ అరుదైన మైలురాయి..

గంభీర్ ఖాతాలో చెత్త రికార్డు..

ప్ర‌స్తుతం గౌహ‌తి వేదిక‌గా జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఓడిపోతే టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ ఖాతాలో ఓ చెత్త రికార్డు న‌మోదు అవుతుంది. స్వ‌దేశంలో రెండు విదేశీ జ‌ట్ల చేతుల్లో రెండు వైట్‌వాష్‌లు ఎదుర్కొన్న మొద‌టి హెడ్ కోచ్‌గా అత‌డు నిలుస్తాడు. గతేడాది (2024లో ) భార‌త్‌ను కివీస్ వైట్‌వాష్ చేసిన‌ప్పుడు కూడా టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గంభీర్ ఉన్నాడు.