World Cup-2023 : ఐసీసీ వరల్డ్ కప్.. బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం

బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు. ఈ వరల్డ్ కప్ లో డికాక్ మూడో సెంచరీ చేశాడు. కాగా, దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా సెంచరీ చేశాడు.

World Cup-2023 : ఐసీసీ వరల్డ్ కప్.. బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం

South Africa win over Bangladesh

World Cup-2023 – South Africa Win : ఐసీసీ వరల్డ్ కప్ – 2023లో బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై 149 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 382 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు.

ఈ వరల్డ్ కప్ లో డికాక్ మూడో సెంచరీ చేశాడు. కాగా, దక్షిణాఫ్రికాపై బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ మహ్మదుల్లా సెంచరీ చేశాడు. మహ్మదుల్లా 111 బంతుల్లో 111 పరుగులు చేశాడు.  దక్షిణాఫ్రికా బ్యాటింగ్ : డికాక్ 174, క్లాసెన్ 90, మార్క్రమ్ 60, మిల్లర్ 34 పరుగులు చేశాడు.

ODI World Cup 2023 : పాకిస్థాన్ ను చిత్తుచేసిన అఫ్గానిస్థాన్.. పాక్ జట్టు సెమీఫైనల్‌కు చేరే అవకాశాలున్నాయా? ఎలా అంటే

బంగ్లాదేశ్ బౌలింగ్ : హసన్ కు 2, మిరాజ్, షకీబ్, షరీపుల్ కు తలో వికెట్ తీసుకున్నారు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ : మహ్మదుల్లా 111, లిటన్ దాస్ 22 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలింగ్ : గెరాల్డ్ 3 వికెట్లు తీసుకున్నాడు. మార్కో జాన్సెన్, విలియమ్స్, రబాడ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.