సెంచరీలతో రెచ్చిపోయిన రైజర్స్.. బెంగళూరు టార్గెట్ 232
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ సాధించని అత్యధిక స్కోరును సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసింది.

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ సాధించని అత్యధిక స్కోరును సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసింది.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకూ సాధించని అత్యధిక స్కోరును సన్‌రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసింది. సొంతగడ్డపై చెలరేగి ఆడి రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు 232 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఉప్పల్ వేదికగా జరుగుతోన్న మ్యాచ్‌లో ఓపెనర్లు దూకుడైన ఆటతీరు ప్రదర్శించారు.
Read Also : అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లో రుణ మాఫీ : రాహుల్ గాంధీ
ఈ క్రమంలో జానీ బెయిర్ స్టో(114; 56బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్సులు), డేవిడ్ వార్నర్( 100; 55 బంతుల్లో 4ఫోర్లు, 5 సిక్సులు) పరాక్రమం మ్యాచ్ ఆసాంతం కొనసాగింది. 16.2 ఓవర్ల వద్ద ఓపెనర్ బెయిర్ స్టో జట్టు స్కోరు 185 పరుగుల వద్ద వికెట్‌ను కోల్పోయాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్(6), విజయ్ శంకర్(9) సహకరించకపోవడంతో స్కోరు బోర్డు కాస్త నిదానంగా నడిచింది.
Read Also : ఎయిర్ పోర్ట్ పేరు మార్చాలి…విమానంలో పార్టీ అధ్యక్షుడు నిరసన