Cricketer Loses Teeth : గ్రౌండ్‌లో షాకింగ్ ఘటన.. క్రికెటర్ పళ్లు రాలిపోయాయి, వీడియో వైరల్

Cricketer Loses Teeth : క్రికెట్ అన్నాక గాయాలు కామన్. గ్రౌండ్ లో ఆటగాళ్లు గాయాల బారిన పడటం సర్వ సాధారణం. బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనో, బౌలింగ్ చేస్తున్న సమయంలోనో లేక ఫీల్డింగ్ సమయంలోనో గాయాల బారిన పడుతుంటారు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి. మరికొన్ని సందర్భాల్లో తీవ్రమైన గాయాలవుతాయి. గ్రౌండ్ లో ఆడుతూ క్రికెటర్లు గాయపడిన ఘటనలు ఇప్పటివరకు అనేకం జరిగాయి. తాజాగా ఓ క్రికెట్ మ్యాచ్ లో షాకింగ్ ఘటన జరిగింది. క్యాచ్ పడుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ క్రికెటర్ మూతి పళ్లు రాలిపోయాయి.

లంక ప్రీమియర్ లీగ్ లో దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. శ్రీలంక స్టార్ క్రికెటర్ చమిక కరుణరత్నే క్యాచ్ అందుకునే క్రమంలో తీవ్రంగా గాయపడ్డాడు. హై క్యాచ్ పట్టే క్రమంలో తన మూతి పళ్లు రాళగొట్టుకున్నాడు.

Also Read..Bangladesh vs India: బొటనవేలుకి కట్టుకట్టించుకుని వచ్చి 5 సిక్సులతో రోహిత్ మెరుపులు.. ప్రశంసల జల్లు

లీగ్ లో భాగంగా బుధవారం క్యాండీ ఫాల్కన్స్, గాలె గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్ లో శ్రీలంక ఆల్ రౌండర్ చమికా కరుణరత్నే క్యాండీ ఫాల్కన్స్ టీం తరపున ఆడుతున్నాడు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చమిక కరుణరత్నే గాయపడ్డాడు. గాల్లోకి లేచిన బాల్ ను క్యాచ్ పడుతుండగా, బాల్ నేరుగా అతని మూతికి బలంగా తగిలింది. దీంతో నోటి నుంచి రక్తం వచ్చింది. 4 దంతాలు ఊడిపోయాయి.

బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో గాలె గ్లాడియేటర్స్ ప్లేయర్ ఫెర్నాండో భారీ షాట్‌కు ప్రయత్నించగా.. మిస్ టైమ్ అయి బంతి గాల్లోకి లేచింది. చాలా హైగా వచ్చిన ఈ క్యాచ్‌ను అందుకునేందుకు పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కరుణరత్నే పరిగెత్తాడు. క్యాచ్ కోసం సహచరులను వారించి మరీ వెనక్కి పరుగెత్తుకొచ్చిన కరుణరత్నే.. బంతి గమనాన్ని అంచనా వేయలేకపోయాడు.

Also Read..Viral Video: ప్రేక్షకుల్లోకి దూసుకెళ్లి యువకుడిని కొట్టబోయిన పాకిస్థాన్ క్రికెటర్ హాసన్ అలీ

దాంతో బాల్ నేరుగా వచ్చి అతని మూతికి బలంగా తాకింది. అతని ముందు పళ్లు నాలుగు ఊడి రక్తం కారింది. పళ్లు రాలినా.. కరుణ రత్నే క్యాచ్ మాత్రం వదల్లేదు. బంతిని అందుకొని పక్కనే వచ్చిన సహచరుడికి ఇచ్చి మూతిని పట్టుకొని నొప్పితో డగౌట్ చేరాడు. వెంటనే కరుణ రత్నేను ఆసుపత్రికి తరలించారు. నాలుగు పళ్లు ఊడిపోయాయని, సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. కరుణరత్నే క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, అంతనొప్పిలోనూ క్యాచ్ ను వదలకపోవడంపై నెటిజన్లు కరుణరత్నేను అభినందిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, అంతనొప్పిలోనూ క్యాచ్ ను వదలకపోవడంపై నెటిజన్లు కరుణరత్నేను అభినందిస్తున్నారు. వాస్తవానికి అది అంత ఈజీ క్యాచ్ కాదని, వెనక్కి పరిగెత్తి వచ్చి మరీ క్యాచ్ పట్టుకోవడం నిజంగా గ్రేట్ అని కామెంటేటర్లు అన్నారు. అది వండర్ ఫుల్ క్యాచ్ అని ప్రశంసించారు. వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి పట్టిన ఆ క్యాచ్ ను బ్రిలియంట్ గా అభివర్ణించారు. అయితే, బంతి మూతికి బలంగా తాకి పళ్లు రాలిపోవడం దురదృష్టకరమన్నారు.

ట్రెండింగ్ వార్తలు