Bangladesh vs India: బొటనవేలుకి కట్టుకట్టించుకుని వచ్చి 5 సిక్సులతో రోహిత్ మెరుపులు.. ప్రశంసల జల్లు

భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో గాయపడినప్పటికీ బొటనవేలుకి కట్టుకట్టించుకుని వచ్చి మరీ 5 సిక్సులు, 3 ఫోర్లతో కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపులు మెరిపించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు కోల్పోయాక ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

Bangladesh vs India: బొటనవేలుకి కట్టుకట్టించుకుని వచ్చి 5 సిక్సులతో రోహిత్ మెరుపులు.. ప్రశంసల జల్లు

Bangladesh vs India

Bangladesh vs India: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య షేర్-ఎ-బంగ్లా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో గాయపడినప్పటికీ బొటనవేలుకి కట్టుకట్టించుకుని వచ్చి మరీ 5 సిక్సులు, 3 ఫోర్లతో కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపులు మెరిపించాడు. టీమిండియా బ్యాట్స్‌మెన్ వరుసగా వికెట్లు కోల్పోయాక ఎనిమిదో స్థానంలో క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ 28 బంతుల్లో 51 పరుగులు చేసిన విషయం తెలిసిందే.

దీంతో రోహిత్ పై ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచు ఓడిపోతున్న సమయంలో, టీమిండియా అభిమానులు ఆశలు వదులుకున్న వేళ రోహిత్ శర్మ అనూహ్యంగా క్రీజులోకి వచ్చాడు. భారీ షాట్లు ఆడుతూ టీమిండియా అభిమానుల్లో మళ్ళీ ఆశలు చిగురింపజేశాడు. చివరి బంతికి సిక్సు కొట్టి టీమిండియాను గెలిపిస్తాడని అందరూ అనుకున్నారు. అయితే, దురదృష్టవశాత్తూ సిక్సు కొట్టలేకపోయాడు.

ముస్తాఫిజుర్ రెహమాన్ వేసిన బంతిని రోహిత్ శర్మ సిక్సుగా మలచలేకపోయాడు. టీమిండియా 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయినప్పటికీ రోహిత్ శర్మ అందరి మనసులూ గెలుచుకున్నాడు. పలువురు ప్రముఖులతో పాటు క్రికెట్ అభిమానులు రోహిత్ ను అభినందించకుండా ఉండలేకపోతున్నారు. అతడికి సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

Demonetisation: నోట్ల రద్దుపై విచారణ ముగించిన సుప్రీం.. కేంద్రానికి ఆర్బీఐకి ఆదేశాలు